ట్రంప్ పోటీలో లేకపోతే నేను పోటీచేయనంటున్న బైడెన్

ట్రంప్ పోటీలో లేకపోతే నేను కూడా పోటీ చేయను. కానీ పోటీలో ట్రంప్ ఉంటే తాను కూడా పోటీ చేస్తానని బైడెన్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-12-06 13:30 GMT

అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. దేశప్రయోజనాల కోసం మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను రానివ్వమని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాను కంపు చేశారని బైడెన్ విమర్శిస్తున్నారు. ట్రంప్ మళ్లీ వస్తే అరాచకమే రాజ్యమేలుతుందని అంటున్నారు. ప్రజాస్వామ్య విలువలకు నీళ్లొదులుతారని విమర్శలు చేస్తున్నారు.

ట్రంప్ పోటీలో లేకపోతే నేను కూడా పోటీ చేయను. కానీ పోటీలో ట్రంప్ ఉంటే తాను కూడా పోటీ చేస్తానని బైడెన్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోటీలో ట్రంప్ ఉండటంతో బైడెన్ వయోభారంతో బాధపడుతున్నందున రెండోసారి అధికారం కట్టబెడతారో లేదో తెలియడం లేదు. ఇక్కడ బైడెన్ వయసే ప్రధానం కానుంది. రెండోసారి పదవీ కాలం పూర్తి చేసేనాటికి 86 ఏళ్లకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో బైడెన్ ను అమెరికన్లు ఆదరిస్తారో లేదో అంతుచిక్కడం లేదు.

2024లో ట్రంప్ గెలిస్తే అమెరికాలో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతుంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే పరిస్థితులు మరోలా ఉంటాయని బైడెన్ పెదవి విరుస్తున్నారు. ట్రంప్ మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మాత్రమే నియంతగా ఉంటానని వ్యాఖ్యానిస్తున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. పోటీ అనివార్యంగా ఉండనుందని పలువురు చెబుతున్నారు.

ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా ఆగమవుతుందని బైడెన్ తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరి మధ్యే ఉంటుందా లేక ఇంకా ఎవరైనా పోటీలో నిలుస్తారా అనేది తెలియడం లేదు. మొత్తానికి అధ్యక్ష ఎన్నికలు అమెరికాకు ప్రధానం కానున్నాయి. ఈనేపథ్యంలో బైడెన్, ట్రంప్ ఏ మేరకు ప్రభావితం చేస్తారో చూడాలి. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపుపై ట్రంప్ ఎన్నో ఆశలు పెంచుకున్నా చివరకు విజయం మాత్రం బైడెన్ నే వరించింది.

ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించే చర్చలు నడుస్తున్నాయి. బైడెన్ కు వయోభారం ఉన్నందున ఆయనకు మద్దతు ఇస్తారా లేక ట్రంప్ వైపు మొగ్గు చూపుతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ట్రంప్ దూకుడు నిర్ణయాల వల్ల అమెరికా కష్టాలు ఎదుర్కొంటుందనే వాదనలు కూడా రావడం సహజమే. ఈ క్రమంలో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో అనే సందేహాలు రావడం కామనే. ఎవరు విజయం సాధిస్తారో? ఎవరు ఇంటి బాట పడతారో వేచి చూడాల్సిందే మరి.

Tags:    

Similar News