మోరా మరణంతో తెరపైకి కొత్త పెద్దాయన... వయసు ఎంతో తెలుసా?

ప్రపంచంలోని అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న జువాన్ పెరేజ్ మోరా (114) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

Update: 2024-04-05 13:30 GMT

ప్రపంచంలోని అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న జువాన్ పెరేజ్ మోరా (114) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తర్వాత ప్రపంచంలోని అత్యంత పెద్ద వయస్కుడు ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆ స్థానాన్ని జాన్ టిన్నిస్ వుడ్ భర్తీచేశారు! ప్రస్తుతం ఆయన ప్రపంచంలోని అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా నిలిచారు.

అవును... గ్రేట్ బ్రిటన్ కు చెందిన జాన్ టిన్నిస్ వుడ్ ఈ వారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు అయ్యారు. ఈయనకు 111 సంవత్సరాలు కాగా.. ఆగస్టు 2 న ఆయన నెక్స్ట్ బర్త్ డే సమీపిస్తోంది. బ్రిటన్ ప్రాతినిధ్యం వహిస్తూ మిత్రరాజ్యాల కోసం పాల్గొన్న రెండో ప్రపంచ యుద్ధంలో జాన్ టిన్నిస్ వుడ్ పనిచేశారని చెబుతున్నారు!

ఈ నేపథ్యంలో... ఇంత సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం వెనుక ఉన్న రహస్యాన్ని ఈ సందర్భంగా టిన్నిస్‌ వుడ్ బయటపెట్టాడు. ఇందులో భాగంగా... ప్రతీ శుక్రవారం నాడూ చేపల భోజనం చేయడం వల్ల వయసు పెరుగుతున్నప్పటికీ ముందుకు సాగుతున్నTlu తెలిపారు. ఇలా చేపల భోజనంతోపాటు ప్రతీదానిలోను మితం పాటించడం కూడా ఒక కారణం అని వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం మెర్సీ సైడ్ కేర్ హోం లో నివసిస్తున్న టిన్నిస్ వుడ్... వీకెండ్ డిన్నర్ ట్రీన్ ను ఎప్పTiకీ మిస్ అవ్వరట. ఇక 1912లో జన్మించిన ఆయన.. రెండు ప్రపంచ యుద్ధాల్లోను ఒకదానిలో పోరాడారు. ఇదే సమయంలో తాజా మహమ్మారి కోవిడ్ - 19ని కూడా ఎదుర్కోగలిగాడు. దివంగత క్వీన్ ఎలిజబెత్ ను ఈయన రెండు వేర్వేరు సందర్భాల్లో కలుసుకున్నారంట.

ఇదే క్రమంలో... తన గడిచిన పుట్టిన రోజున కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా ల నుంచి గ్రీటింగ్ కార్డ్స్ కూడా అందుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... రెండో ప్రపంచ యుద్ధ సమయంలో "రాయల్ మెయిల్" గా సేవలందించిన టిన్నిస్ వుడ్... ఈసారి బర్త్ డే ని మరింత ఘనంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది!!

Tags:    

Similar News