రేపే అమెరికా ఎన్నికలు.. చివరి రోజు ఆసక్తికరంగా హారిస్, ట్రంప్ ప్లాన్స్!
ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 5 (మంగళవారం) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలా ఈ ఎన్నికలకు ఇంక ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో.. అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరూ చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఆఖరి నిమిషం వరకూ అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు!
అవును... రేపే (మంగళవారం - నవంబర్ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో పోలింగ్ తేదీ కంటే ముందుగానే ఓటు వేసే అవకాశాన్ని ఇప్పటికే కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా... ఇప్పటికే సుమారు 6.8 కోట్ల మంది ఓటేశారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులిద్దరూ చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.
ఇందులో భాగంగా... మంగళవారం వరకూ నార్త్ కరోలినాలోనే ఉండి ర్యాలీలు నిర్వహించాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. గతంలో రెండుసార్లు (2016, 2020)లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ప్రధానంగా ఎక్కువ దృష్టి సారించారు. ఇదే సమయంలో... వర్జీనియా, న్యూమెక్సికో లనూ సీరియస్ గా తీసుకున్నారు. ఆదివారం కింగ్ స్టన్ లో ప్రచారం చేశారు.
మరోపక్క కమలా హారిస్ శనివారం నార్త్ కరోలినాలోని ఛార్లెట్ లో ప్రచారం చేశారు. నేడు (సోమవారం) తన భర్త డగ్ ఎం హోఫ్ ను గ్రీన్ విల్లేకు పంపుతున్నారు. మరోపక్క నార్త్ కరోలినాలోని 78లక్షలమంది ఇప్పటికే ఓటు వేసేశారు. అంటే.. సుమారు సగం మంది ఓటేశారన్నమాట.
ఇదే సమయంలో... పలు పత్రికలకు ఆర్టికల్స్ రాయడంతో పాటు.. పలు టీవీ షోలలోనూ కమలా హారిస్ పాల్గొంటారు. ఆమె చివరి ప్రయత్నం ఈ విధంగా సాగనుంది.
కాగా... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్ కు ఓటర్లు వెల్లువెత్తున్నారు. దీంతో.. గతంలో కంటే ఎక్కువగా ఈసారి పోలింగ్ కేంద్రాలను పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... గతంలో కంటే 50శాతం అదనంగా పలు చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 6.8 కోట్ల మంది అమెరికన్లు మైల్స్, పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటువేశారు.