కమలా హరిస్ ప్రచారంలో "రోజా" సినిమా పాటలు.. వీడియో వైరల్!

వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక కోసం ప్రచారం మరింత ఊపందుకుంది.

Update: 2024-10-19 04:14 GMT

వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక కోసం ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపోటములను సాశించే సత్త ఉన్న కీలక రాష్ట్రాల్లో దక్షిణాసియా సంతతి ఓటర్ల మద్దతును కూడగట్టడానికి కమలా హారిస్ ప్రచారానికి నేషనల్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు అజయ్ భుటోరియా బాలీవుడ్ సంగీతాన్ని ప్రయోగిస్తున్నారు.

అవును... ఒక ఇండియన్ అమెరికన్ డెమోక్రటిక్ ఫండ్ రైజర్ కీలక రాష్ట్రాల్లోని దక్షిణాసియా ఓటర్లను ఏకం చేసేందుకు "ఐ విల్ ఓట్ ఫర్ కమలా హారిస్.. టిమ్ వాల్ట్" అనే డిజిటల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో బాలీవుడ్ లో సూపర్ హిట్ సాంగ్స్ కి సంబంధించిన ఇనిస్ట్రుమెంటల్ వెర్షన్ ని సెట్ చేసి వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా... ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన "రోజా" సినిమాలోని "చిన్నిచిన్ని ఆశ" పాటతో పాటు "యానిమల్" సినిమాలోని సంగీతం కలగలిపిన ప్రచార గీతాలను పొందుపరిచి వినిపిస్తున్నారు. ఈ సంగీతం దక్షిణాసియా కమ్యునిటీలను కనెక్ట్ చెయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇందులో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ భాషల్లో సందేశాలున్నాయి. మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిన్, అరిజోనా, ఉత్తర కెరొలైనా, నెవాడా రాష్ట్రాల్లోని దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ వీడియోలను ఉపయోగిస్తున్నారని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన అజయ్ భుటోరియా... మంచి భవిష్యత్ కోసం కమలా హారిస్ కు, ట్రంప్ విభజనకు మధ్య ఎంపిక స్పష్టంగా ఉందని.. వేలాదిమంది దక్షిణాసియా వాలంటీర్లు ఈ రేసును గెలవడంలో సహాయచేయడానికి ఆర్గనైజింగ్ తలుపులు తడుతున్నారని, ఫోన్ కాల్స్ చేస్తున్నారని తెలిపారు.

కమలా హారిస్ పట్ల దక్షిణాసియా కమ్యునిటీ ఆశను కలిగి ఉందని.. ట్రంప్ విభజనను అధిగమించే భవిష్యత్తును నిర్మించడానికి పరుగెత్తుతోందని.. ఆమె 50 లక్షల మంది భారతీయ అమెరికన్లకు ఆశాకిరణమని అన్నారు.

Tags:    

Similar News