కేసీఆర్ మా రాష్ట్రానికి రండి.. ఖ‌ర్చులు నావే: క‌ర్ణాట‌క సీఎం బిగ్ ఆఫ‌ర్‌

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రానికి వ‌చ్చిన సిద్ద‌రామ‌య్య‌.. నేటి నుంచి రెండు రోజుల పాటు ఇక్క‌డే ఉండ‌నున్నారు.

Update: 2023-11-27 03:38 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి, సీఎం కేసీఆర్‌కు క‌ర్ణాటక సీఎం సిద్ద‌రామ‌య్య బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ''రండి మా రాష్ట్రానికి తీసుకువెళ్తా. ఖ‌ర్చులు నేనే పెట్టుకుంటే. ప్ర‌తి జిల్లాలోనూ మిమ్మ‌ల్ని తిప్పుతా. ఐదు గ్యారెంటీలు ఎలా అమ‌లవుతున్నాయో చూపిస్తాం'' అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రానికి వ‌చ్చిన సిద్ద‌రామ‌య్య‌.. నేటి నుంచి రెండు రోజుల పాటు ఇక్క‌డే ఉండ‌నున్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయ‌కుల త‌ర‌ఫున‌.. క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు జిల్లాల్లో సిద్ద‌రామ‌య్య ప్ర‌చారం చేయ‌ను న్నారు. గ‌త రాత్రి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సిద్ద‌రామ‌య్య‌.. తాజాగా ఓ హోట‌ల్‌లో మీడియాతో మాట్లాడారు . ఈ క్ర‌మంలో బీఆర్ ఎస్ నాయ‌కులు, బీజేపీ నేత‌లు చేస్తున్న ప్ర‌చారాన్ని అంకెలు సంఖ్య‌ల సైతంగా తిప్పికొట్టారు. తాము ఈ ఏడాది మేలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లకు ఐదు గ్యారెంటీలు ఇచ్చామ‌ని.. వాటిని పూర్తిగా అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి ఐదో హామీ.. గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. దీనికి సంబందించి 20 వేల నుంచి 40 వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లోనే కేటాయించిన‌ట్టు తెలిపారు. కానీ.. త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇలా విమ‌ర్శ‌లు చేసేవారు ఎవ‌రైనా క‌ర్ణాట‌కకు రావాల‌ని ఆయ‌న సూచించారు. ముఖ్య‌మంత్రిని తానే స్వ‌యంగా రాష్ట్రానికి తీసుకువెళ్తాన‌ని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసేబాద్య‌త‌ను రాహుల్‌గాంధీ తీసుకున్న విష‌యాన్ని తెలంగాణ స‌మాజం గుర్తించాల‌ని సిద్ద‌రామ‌య్య పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని గౌర‌వించాల‌ని.. గెలిపించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎవ‌రూ ఈ విష‌యంలో అపోహ‌లు ప్ర‌చారం చేయొద్ద‌ని ఆయ‌న విన్న‌వించారు. మ‌రి ఆయ‌న ప్ర‌చారం ఏమేరకుప్ల‌స్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News