ఫోన్ టాపింగ్ కేసీఆర్ ఒప్పుకున్నారా ?

దాని మీదనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఫోన్ టాపింగ్ అన్న దానిని కేసీఆర్ పోలీసుల మీద తోసేసినట్లుగా కనిపిస్తోంది.

Update: 2024-04-25 10:47 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ జనంలోకి వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీకి సీట్లు ఓట్లు దక్కించుకునేందుకు ఆయన బస్సు యాత్రను కూడా ప్రారంభించారు. అదే సమయంలో ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ ఒక ప్రముఖ టీవీ చానల్ లో జరిగిన ఓపెన్ డిబేట్ లో ఫోన్ టాపింగ్ గురించి కీలక కామెంట్స్ చేశారు.

దాని మీదనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఫోన్ టాపింగ్ అన్న దానిని కేసీఆర్ పోలీసుల మీద తోసేసినట్లుగా కనిపిస్తోంది. పోలీసులు మావోయిస్టుల కోసమో లేక టెర్రరిస్టుల కోసమో చేస్తారు అన్నట్లుగా మాట్లాడారు. ఇలా ఫోన్ టాపింగ్ చేసే దానిలో ముఖ్యమంత్రికి ఏమిటి సంబంధం అన్నట్లుగా కేసీఆర్ మాట్లాడారు అని అంటున్నారు. అయితే హోం మినిస్టర్ కి తెలుసు అని ఆయన అంటున్నారు. అంతే కాదు దానికి సెపరేట్ గా ఒక వ్యవస్థ ఉంటుందని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదంతా సమాచారం సేకరించడం కోసమే అని కూడా అంటున్నారు.

అదే విధంగా లా అండ్ ఆర్డర్ కోసం కూడా చేస్తూ ఉంటారని కేసీఆర్ అంటున్నారు. ఇవన్నీ మామూలే అన్నట్లుగా మాట్లాడారు. పోలీసులు పలు రకాలుగా చేస్తూ ఉంటారు అని కూడా ఆయన అన్నట్లుగా ఉంది. ఇలా అందులో భాగంగా చేసి ఉంటారు కానీ ఇందులో సీఎం కి సంబంధం ఏమిటి అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం సీఎం కి తెలియదు అని హోం మినిస్టర్ కి తెలుసు అని అంటున్నారు. ఇక ఫోన్ టాపింగ్ రాజకీయ అవసరాలకు చేయలేదు అని అంటున్నారు. అదే విధంగా ప్రతీ రోజూ ఎన్ని ఫోన్లు టాపింగ్ చేశారో కూడా సీఎం కి చెప్పరని కూడా కేసీఆర్ అంటున్నారు.

అదే విధంగా కిడ్నాపర్స్ కోసం కూడా ఫోన్ టాపింగ్ చేయవచ్చు అన్నట్లుగా కూడా కేసీఆర్ మాట్లాడారు. ఇదిలా ఉంటే ప్రభాకర్ అనే అధికారి పొలిటికల్ గా ఉద్దేశ్యాలతో ఫోన్ టాపింగ్ చేశారా అన్న ప్రశ్నలకు మాత్రం కేసీఆర్ సరైన సమాధానం చెప్పలేదు.

ఇజ్రాయెల్ నుంచి గాడ్జెట్స్ తెచ్చారా అన్న ప్రశ్నలకు కూడా కేసీఅర్ ఇచ్చిన జవాబు చిత్రంగా ఉంది అంటున్నారు. అవి పోలీసుల అంతర్గత వ్యవహారం. మాకు ఏమీ తెలియదు మేము ఏమీ వాటిని పట్టించుకోమని కూడా ఈజీగా చెప్పేసి తేల్చేశారు.

అంతే కాదు రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం అన్నది తనకు అసలు తెలియదు అని కేసీఆర్ అంటున్నారు. దీనిని బట్టి చూస్తే అంతా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అలాగే హోం శాఖ మీద కేసీఆర్ వేసినట్లుగా ఉంది అని అంటున్నారు.

ఫోన్ టాపింగ్ అనేది పూర్తిగా పోలీసు డిపార్ట్మెంట్ వ్యవహారమని కొన్ని టాప్ చేసి ఇవ్వమని అడుగుతామని అంతకు మించి తమకు ఏమీ సమాచారం కూడా ఉండదని ఆయన అంటున్నారు. ఇక ఫోన్ టాపింగ్ వ్యవహారం మీద ముఖ్యమంత్రికి ఎలాంటి రిపోర్టులు ఇవ్వరని కేసీఅర్ స్పష్టంగా చెప్పేశారు.

అసలు ఫోన్ టాపింగ్ అన్నది లీగల్ గా చేశాం తప్పించి ఇల్లీగల్ గా చేయలేదని, అలా చేయాలని కూడా తమకు తెలియదు అని అంటున్నారు. అసలు ఫోన్ టాపింగ్ అన్నది చాలా సిల్లీ వ్యవహారంగా కూడా కేసీఅర్ కొట్టిపారేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదని ఆయన చెబుతున్నారు. అంతా ప్రైవేట్ పార్టీలనే ఫోన్ టాపింగ్ చేశారు అని అంటున్నారు. ఇక ఇదే విషయమై కేసీఆర్ ఫోన్ టాపింగ్ టూపింగ్ ఇవన్నీ ఏమిటి అంటూ ఎగతాళీగా కూడా మాట్లాడారు.

పోనీ ఆ ప్రైవేట్ పార్టీల విషయంలో టాపింగ్ ఎందుకు జరిగింది అన్న దానికి సూటిగా కేసీఆర్ బదులు ఇవ్వలేదు. దీని మీద అంత చర్చ అవసరమా అని ఆయన ప్రశ్నించి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. మొత్తానికి దీనిని చూస్తూంటే ఫోన్ టాపింగ్ జరిగింది అని ఇండైరెక్ట్ గా కేసీఆర్ ఒప్పుకున్నట్లు అయింది. అదే సమయంలో తమకు తెలియదు అన్నట్లుగా మాట్లాడారు.

పోలీసుల మీదనే నెట్టేస్తున్నారు. మరి ఫోన్ టాపింగ్ అన్నది బిగ్ ఇష్యూ ఈ విషయంలో ఇంత లైట్ గా తీసుకుని కేసీఆర్ మాట్లాడితే చెల్లుతుందా దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది. దూకుడుగా ముందుకు వెళ్తోంది. మరి దీని మీద చూస్తే కేసీఆర్ అసలు చర్చే అనవసరం అంటున్నారు. పూర్తిగా జనరలైజ్ చేసి తాన్ని లైట్ తీసుకోమని అంటున్నారు. ఇవన్నీ చూసిన వారు కేసీఆర్ మాటలు చూస్తే ఒప్పుకున్నట్లేనా అన్న డౌట్లను కూడా వ్యక్తం చేస్తున్నారుట.

Tags:    

Similar News