విజయమ్మకు వైసీపీలో కీలక పదవి... జగన్ మాస్టర్ స్కెచ్ !
ఆమె 2024 ఎన్నికల ముందు పార్టీ నుంచి బయటకు వెళ్ళడం షర్మిలకు సపోర్టుగా వీడియో బైట్ రిలీజ్ చేయడంతో వైసీపీకి సొంత జిల్లాలో చెప్పరాని డ్యామేజ్ జరిగింది.
వైఎస్సార్ ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక్క చోట చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. 2019 ముందు కుటుంబం ఎలా ఉందో ఇపుడు అలాగే ఉండేలా తెర వెనక జరగాల్సిన కసరత్తు సాగుతోంది అని అంటున్నారు. వైసీపీ పటిష్టానికి తల్లి విజయమ్మ ఎంతగానో కృషి చేశారు. ఆమె వైఎస్సార్ అర్ధాంగి. ఆమె 2024 ఎన్నికల ముందు పార్టీ నుంచి బయటకు వెళ్ళడం షర్మిలకు సపోర్టుగా వీడియో బైట్ రిలీజ్ చేయడంతో వైసీపీకి సొంత జిల్లాలో చెప్పరాని డ్యామేజ్ జరిగింది.
ఏకంగా సొంత జిల్లా కడపలో పది అసెంబ్లీ సీట్లకు గానూ మూడంటే మూడు సీట్లు మాత్రమే దక్కాయి. కంచుకోట అలా మంచుకోటగా మారిపోయింది. అదే సమయంలో టీడీపీ కూటమి భారీ మెజారిటీతో గెలుచుకుంది. ఈ విధంగా అన్ని శాపాలూ వైసీపీకి తగిలి 11 అసెంబ్లీ సీట్లు దక్కాయి.
దాంతో దారుణ పరాభవం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ తిరిగి కోలుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేస్తోంది. పార్టీలో ఉన్న వారు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూండంతో జగన్ సైతం కాస్తా తగ్గి వచ్చారని అంటున్నారు. ఆఖరుకు జగన్ కి నీడగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో ఆయనకు పూర్తిగా వర్తమాన రాజకీయం అర్ధమైంది అని అంటున్నారు.
దాంతో తన తండ్రితో సన్నిహితంగా ఉన్న వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు అని అంటున్నారు. వారంతా కాంగ్రెస్ బ్లడ్, ఆ ఫిలాసఫీ తో ఉన్న వారు. ఎట్టి పరిస్థితిల్లోనూ టీడీపీలోకి వెళ్ళే చాన్స్ లేదు. కాంగ్రెస్ ఏపీలో ఎటూ లేనందువల్ల వారు వైసీపీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
అయితే వైఎస్సార్ ఫ్యామిలీ ఒక్కటిగా ఉండేలా వీరే తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీలో తొందరలో అనేక కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెబుతున్నారు. వైసీపీ పెట్టాక అందులో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ పార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు తన వంతుగా సేవ చేశారు. ఆమె పార్టీలో ఉండడం వైసీపీకి ఒక అనుకూల అంశమని 2024 ఎన్నికల తరువాత తెలిసివచ్చింది.
ఎందుకంటే 2022 గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో విజయమ్మ తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. ఆమె తన కుమార్తె షర్మిల తెలంగాణాలో పెట్టిన పార్టీకి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు. ఆ తరువాత నుంచి వైసీపీకి అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. తెలంగాణాలో పార్టీ పెట్టినా షర్మిల జగన్ మీద విమర్శలు చేయలేదు, ఎపుడైతే ఆమె ఏపీలో ఎంట్రీ ఇచ్చారో నాటి నుంచే జగన్ మీద డైరెక్ట్ విమర్శలు చేశారు.
ప్రత్యర్ధి పార్టీలు సైతం అననన్ని మాటలు అన్నారు అన్నీ కలసి వైసీపీని ఓడగొట్టాయి. అందుకే కాంగ్రెస్ లో ఉన్న వైఎస్సార్ సన్నిహితులు అంతా వైసీపీకి మళ్ళీ ఒకనాటి వైభవం వచ్చేలా చేయాలంటే కచ్చితంగా కుటుంబం కలసి ఉండాలని కోరుతున్నారని అంటున్నారు. ఈ మేరకు జగన్ సైతం వాస్తవాలను అర్థం చేసుకున్నారని అందుకే విజయమ్మను సాదరంగా ఆహ్వానించి తొందరలో వైసీపీలో కీలకమైన పదవిని అప్పగిస్తారు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే విజయమ్మ కూడా షర్మిల రాజకీయం ఆశించినంతగా లేకపొవడంతో మళ్ళీ వైసీపీని బలోపేతం చేసేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. ఆమె గత డిసెంబర్ లో ఇడుపులపాయలో జరిగిన కార్యక్ర్మామలో జగన్ తో కలసి పాల్గొన్నారు. అంతే కాదు జగన్ లండన్ టూర్ లో కూడా ఆమె కూడా ఉన్నారని చెబుతున్నారు. ఇక షర్మిల జగన్ ల మధ్య విభేదాలు కూడా సమసిపోయేలా ఒకనాటి వైఎస్సార్ మిత్రులు అంతా కృషి చేస్తున్నారు అని అంటున్నారు. అన్నీ కనుక అనుకున్నట్లుగా సాగితే మాత్రం వైసీపీ మళ్ళీ బలంగా పుంజుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏపీలో వైసీపీ రాజకీయం ఎలా ఉంటుందో.