ప్రచారంలో ముద్దు పెట్టిన ఎంపీ... తప్పేమీ లేదంటున్న యువతి!

ఈ సమయంలో ఒక ఎంపీ మాత్రం రొటీన్ కి భిన్నంగా ఆలోచించారు! ఇందులో భాగంగా యువతికి ముద్దుపెట్టారు

Update: 2024-04-10 09:48 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. హామీల వర్షాలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో... ఇంటింటి ప్రచారాలూ మొదలుపెట్టేశారు. ఈ ప్రచారాల్లో హోటల్స్ లోకి వెళ్లి దోశలు వేయడం.. టీ పెట్టడం.. పిల్లలను ఎత్తుకుని ఆడించడం వంటివి ఎన్నో చేస్తున్నారు. ఈ సమయంలో ఒక ఎంపీ మాత్రం రొటీన్ కి భిన్నంగా ఆలోచించారు! ఇందులో భాగంగా యువతికి ముద్దుపెట్టారు!

అవును.. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేసే చిత్ర విచిత్రాలు నెట్టింట వైరల్ అవుతుంటాయనే సంగతి తెలిసిందే! మిగతా సమయల్లో ఇంటికెళ్లి గంటలు తరబడి ఎదురుచూసినా దర్శనభాగ్యం కలిగించని నేతలు.. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు జనాల్లోకి వచ్చేస్తారని.. ఈ సందర్భంగా వారు చేసే పనులు విచిత్రంగా ఉంటుంటాయని.. ఇంతకాలం చూసిన వ్యక్తేనా ఈయన అని భావిస్తుంటారని అంటుంటారు. ఈ సమయంలోనే ప్రచారనికెళ్లి ఒక యువతికి ముద్దుపెట్టారు బీజేపీ ఎంపీ!

వివరాళ్లోకి వెళ్తే... బెంగాల్‌ లోని ఉత్తర మాల్దా లోక్‌ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇందులో భాగంగా.. ఇంటింటి బయలుదేరారు! ఈ క్రమంలో తన నియోజకవరంలోని శ్రిహిపుర్‌ గ్రామంలో ప్రచారానికని వెళ్లిన ఆయన... ఓ యువతి చెంపపై ముద్దు పెట్టారు. దీంతో.. ఈ వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది!

మరోపక్క ప్రచారనికని ఇళ్లకు వెళ్లి ఇలా యువతుల బుగ్గలపై ముద్దులు పెట్టడం ఏమిటంటూ... రాజకీయ దుమారం లేచింది! దీనిపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పందిస్తూ.. బీజేపీని దుయ్యబట్టింది. ఇందులో భాగంగా... మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలా బీజేపీలో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు అని కామెంట్ చేసింది.

ఇదే సమయంలో... నారీమణులకు "మోడీ పరివార్‌" ఇస్తున్న గౌరవం.. ఇది ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి..! అని టీఎంసీ విమర్శలు గుప్పించింది. ఇక నెటిజన్ల రియాక్షన్ కైతే లోటే లేదు! ఎవరి స్థాయిలో వారు తమ తమ క్రియేటివిటీకి పని చెప్పి... బీజేపీ నేతలు ఏకిపారేస్తున్నారు!

దీంతో... ఈ విషయంపై సదరు ఎంపీ ఖగేన్ స్పందించారు. ఇందులో భాగంగా తాను ముద్దుపెట్టుకున్న సదరు యువతిని తన కుమార్తెలా భావించినట్లు తెలిపారు. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఆ యువతి కూడా ఈ విషయంపై స్పందించింది. సొంత కుమార్తెలా భావించి ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో సమస్య ఏంటి? అని ప్రశ్నిస్తోంది!

ఇదే సమయంలో... ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేసేవారిది చెత్త మనస్తత్వం అంటూ నిప్పులు చెరిగారు ఆ యువతి. ఆ ఫోటో తీసిన సమయంలో తమ తల్లితండ్రులు పక్కనే ఉన్నారని ఆమె తెలిపారు.

Tags:    

Similar News