ఉత్తర కొరియా అధినేత కిమ్ కన్నీళ్లు
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. స్పందించే గుండె అందరికి ఉంటుంది. ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా తనకు మనసుంటుంది.
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. స్పందించే గుండె అందరికి ఉంటుంది. ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా తనకు మనసుంటుంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదు. ఆయన నియంత వైఖరితో ప్రజలు భయపడుతుంటారు. అతడి నిర్ణయాలు అంత కర్కశత్వంగా ఉంటాయని తెలుసు. తన దేశం కోసం ఆయన కూడా కన్నీటి పర్యంతమయ్యాడు.
కరోనా కాలం నుంచి ఉత్తర కొరియా పలు సమస్యలు ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈనేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా జనాభా క్రమంగా తగ్గిపోతోంది. భవిష్యత్ లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని గుర్తించిన కిమ్ తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. జనాభా పెంచాల్సిందిగా వారిని కోరారు. జనాభా గురించి కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు ఎక్కువ సంతానం కనాలని కన్నీళ్లతో వేడుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరకొరియా అంటేనే కర్కశత్వానికి మారుపేరుగా చెబుతారు. అక్కడ శిక్షలు కఠినంగా ఉంటాయి. ఆ దేశ పౌరుడు దక్షిణ కొరియా వీడియో చూశాడని అతడిని బహిరంగంగా చంపేసిన ఉదంతం తెలిసిందే. దీంతో ఉత్తర కొరియా అంటేనే శిక్షలకు నెలవుగా చెబుతారు. అలాంటి దేశ అధినేత కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనంగా మారింది. కఠినమైన ఆంక్షలతో ప్రజలను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటాడు.
దేశ జనాభా తగ్గుతున్నందున తల్లులు ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాల్సిన అవసరం ఉందని ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ లో తల్లుల కోసం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జననాల క్షీణత గురించి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లుల క్షేమం కోసం పాటుపడతామని భరోసా కల్పించారు. మహిళలు కూడా కిమ్ కన్నీళ్లు చూసి చలించిపోయారు. జనాభా పెంచేందుకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
ఇటీవల ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి రహస్యంగా ఉత్తరకొరియాను వదిలి పారిపోయాడు. దీంతో అతడి కోసం అన్వేషిస్తున్నారు. అతడు దొరికితే కఠినమైన శిక్ష విధించే అవకాశం ఉందని అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఉత్తర కొరియా ఆంక్షలు కఠినంగా ఉంటాయి. దీంతో అక్కడ మనుగడ సాగించాలంటే కష్టమే. అందుకే జాగ్రత్తగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎలాంటి పొరపాట్లు చేసినా కనికరం ఉండదు. కఠినమైన శిక్షలే ఉంటాయనడంలో సందేహం లేదు.