కూటమి సర్కారుకు దూకుడు మంచిదేనా ..!
దీనికి కారణం.. తాజాగా సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను అరెస్టు చేయడం ఖాయమైందన్న వార్తలు వస్తుండడమే
కూటమి సర్కారుకు దూకుడు మంచిదేనా? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చర్చ. దీనికి కారణం.. తాజాగా సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను అరెస్టు చేయడం ఖాయమైందన్న వార్తలు వస్తుండడమే. ఏ ప్రభు త్వానికైనా అధికారులే కీలకం. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా.. వాటిని అమలు చేసేందుకు ఆదేశా లు ఇచ్చేందుకు అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయం 14 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్య మం త్రి చంద్రబాబుకు తెలియంది కాదు.
కానీ, ఉన్నతాధికారులపై మాత్రం కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికి.. సంజయ్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికే అరెస్టయిన వారు.. బెయిల్పై బయటకు వచ్చారు. వీరిలో గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ విషయాన్ని చూసిన అధికారి వాసుదేవరెడ్డి కూడా ప్రస్తుతం బెయిల్ తెచ్చుకున్నారు. వీరంతా ఉన్నతాధికారులు కావడం గమనార్హం.
ఇక, ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారంలోనూ.. కొందరు అధికారులకు ఉచ్చు బిగిస్తున్నట్టు సమాచారం. వైసీపీ హయాంలో పనిచేసిన వారిని ఇప్పుడు టార్గెట్ చేసుకోవడం వెనుక.. చాలానే రాజకీయం ఉందని తెలుస్తోంది. అయితే.. వీరిని అరెస్టు చేయడం.. జైళ్లకు పంపించడం వరకు బాగానే ఉంది. కానీ, ఈ ప్రభావం ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులపై పడుతుండడం గమనార్హం. కూటమి సర్కారు చేపడుతున్న పలు పనుల విషయంలో జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజాగా కూడా. . సీఎం చంద్రబాబు.. ఉన్నతాధికారులు ఇంకా బద్ధకం వదిలించుకోలేదని వ్యాఖ్యానించా రు. అంటే.. ఉచిత ఇసుక, మద్యం వ్యవహారాలు సహా.. ఇతర కీలక పనుల విషయంలో ఉన్నతాధికారులు సంతకాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనికి కారణం.. తాజాగా జరుగుతున్న అరెస్టులేనన్న విషయం అధికార వర్గాల్లో రచ్చగా మారింది. రేపు తమ పరిస్థితి ఏంటని కొందరు అధికారులు తల్లడిల్లు తిన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కోరుతున్నా.. కూడా పలు ఫైళ్లు నిలిచిపోతున్నా యి. అంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన అధికారులను టార్గెట్ చేయడం.. వీరిపై ప్రభావం చూపుతోందనడంలో సందేహం లేదు. మరి చివరకుఏం జరుగుతుందో చూడాలి.