వైసీపీ సారథ్యం.. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏం లేదు..!
నిజానికి జగన్‌పై అక్రమ ఆస్తుల కేసులు నమోదైంది.. 2012లో. అంటే.. సుమారు పుష్కర సమయం గడిచిపోయింది.
జగన్‌కు ఇబ్బంది వస్తే.. ఆయనపై ఉన్న కేసుల విచారణ మరింత పెరిగితే.. వైసీపీకి ఎవరు సారథ్యం వహిస్తారు? ఎవరు అధ్యక్షులు అవుతారు? అనేదికొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. నిజానికి జగన్‌పై ఉన్న కేసుల విచారణ పుంజుకున్నది లేదు.. ఆయన జైలుకు వెళ్లింది కూడా లేదు. అయినప్పటికీ.. సుప్రీంకో ర్టు, తెలంగాణ హైకోర్టులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యానికి తోడు రాజకీయంగా మారుతున్న పరిణామాలతో జగన్ అరెస్టు అవుతారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
నిజానికి జగన్‌పై అక్రమ ఆస్తుల కేసులు నమోదైంది.. 2012లో. అంటే.. సుమారు పుష్కర సమయం గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు.. ఈ కేసుల విచారణ ఎలా ఉన్నా.. ఆయనను మాత్రం అరెస్టు చేశారు. ఆ వెంటనే జైలుకు కూడా తరలించారు. సుదీర్ఘంగా 16 మాసాల పాటు జగన్ జైల్లోనే ఉన్నారు. కానీ, తర్వాత ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. ఈ కేసులు యూటర్న్ తీసుకున్నాయన్నది వాస్తవం.
దీంతో వైసీపీ అధినేతపై నమోదైన కేసులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇక, ఇటీవల కూడా.. ముందుకు సాగుతాయని పెద్ద ఎత్తున చర్చ వచ్చినా.. మరోసారి బ్రేకులు పడ్డాయి.ఈ క్రమంలోనే వైసీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు? అనే చర్చ అయితే జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై జగన్ ఆఫ్ దిరికార్డుగా పార్టీ నాయకులతో చర్చించారు. తాను అరెస్టయినా.. మరోసారి జైలుకు వెళ్లినా.. పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పినట్టు సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లాకు చెందిన రెడ్డి నాయకుడు ఒకరు అత్యంత విశ్వసనీయంగా చెప్పిన సమాచారం ప్రకారం.. తాను అరెస్టయినా.. ఇబ్బందిలేదన్న జగన్.. తానే అధ్యక్షుడిగా ఉంటానని తేల్చి చెప్పినట్టు సమాచారం. గతంలో తమిళనాడు సీఎం జయలలిత.. అరెస్టయి నప్పుడు కూడా.. ముఖ్యమంత్రి పదవిని మాత్రమే పళని స్వామికి అప్పగించారని, పార్టీ పగ్గాలు మాత్రం ఆమె వద్దే ఉంచుకున్నారని జగన్ గుర్తుచేసినట్టు తెలిపారు.
అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సొరేన్ అరెస్టయినప్పుడు కూడా.. పార్టీ పగ్గాలు ఆయనే ఉంచుకున్నారని జగన్ చెప్పినట్టు పేర్కొన్నారు. సో.. జగన్ అరెస్టయినా.. పార్టీ అధినేత విషయంలో మార్పు జరగదని సదరు రెడ్డి నాయకుడు చెప్పడం గమనార్హం.