వీధుల్లో శవాల గుట్టలు... లిబియాలో భయానక దృశ్యాలు!

అవును... ఇప్పుడు లిబియాలోని డెర్నా నగరం శవాల దిబ్బగా మారింది. ఎక్కడ చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి.

Update: 2023-09-16 14:58 GMT

డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో లిబియాలోని డెర్నా నగరం శవాల దిబ్బగా మారిన సంగతి తెలిసిందే. తుఫాను తగ్గిన ఇప్పుడు వీధుల్లో ఎటుచూసినా బురద మేటలు కనిపిస్తున్నాయి. వాటిని తవ్వి క్లియర్ చేస్తుంటే... వాటి కింద శవాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. అక్కడ పరిస్థితి అలా ఉంటే... సముద్రం నుంచి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి.

అవును... ఇప్పుడు లిబియాలోని డెర్నా నగరం శవాల దిబ్బగా మారింది. ఎక్కడ చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పేరుకుపోయిన బురద కింద కుప్పలు కుప్పలుగా డెడ్ బాడీలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ భయానక దృశ్యాలే దర్శనమిస్తున్న పరిస్థితి.

లిబియాలో తుఫాను సృష్టించిన మెరుపు వరదల వల్ల ఈ నగరంలో ఇప్పటివరకూ 11,300 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే.. వీరు కాకుండా మరో 10,100 మంది గల్లంతయ్యారని తెలుస్తుంది.

దీంతో... వీరంతా కూడా మరణించి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో... మృతుల సంఖ్య 20 వేలకు పైనే ఉండొచ్చని అనధికారికంగా వెల్లడించిన అధికారులు... ఆ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెబుతుండటం గమనార్హం.

దీంతో పరిస్థితి మొత్తం క్లియర్ అయ్యే వరకూ నగరంలోని ప్రజలు బయటే ఉండాలని సూచించిన అధికారులు.. వాసులను నగరం బయటకు పంపించేశారు. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఫలితంగా ధ్వంసమైన ఇళ్ల కింద చిక్కుకుపోయిన వారి కోసం వేగంగా గాలింపు జరుగుతుంది.

ఇదొక సమస్య అయితే... క్లియర్ చేస్తున్న బురదలో పేళుడు పదార్ధాలు ఉండొచ్చనే భయం కొత్తగా తెరపైకి వచ్చింది. 2011 నుంచి అంతర్గత ఘర్షణలు కొనసాగుతున్న లిబియాలో పెద్ద ఎత్తున మందుపాతరలు పాతిపెట్టారట. దీంతోపాటు రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలుడు పదార్థాలు కూడా లిబియాలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఇవి మెరుపు వరదలతో కొట్టుకుని వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News