వైసీపీకి బలమైన ఆయుధం ఇచ్చిన లోకేష్... ఇక ఆడుకోవడమే....!

చినబాబు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని విజయపధంలో నడిపిస్తున్నారా ఇబ్బంది పెడుతున్నారా అంటే కొన్ని సార్లు రెండవ మాటే నిజమేమో అని అంతా అంటారు.

Update: 2023-12-22 13:30 GMT

చినబాబు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని విజయపధంలో నడిపిస్తున్నారా ఇబ్బంది పెడుతున్నారా అంటే కొన్ని సార్లు రెండవ మాటే నిజమేమో అని అంతా అంటారు. చంద్రబాబు మీడియాను ఫేస్ చేసే తీరు వేరుగా ఉంటుంది. ఆయనకు క్లిష్ట ప్రశ్నలకు ఎలాంటి జవాబులు ఇవ్వాలో బాగా తెలుసు. అదే లోకేష్ అయితే చెప్పాల్సింది క్లారిటీగా చెప్పాశారు అని అనుకుంటారు. కానీ దాని ప్రభావం ఆయన ఊహించలేకపోతున్నారు.

లేటెస్ట్ గా ఒక యూట్యూబ్ చానలో లోకేష్ ఇచ్చిన ఇంటర్వూలో అగ్గి లాంటి ప్రశ్నలకు తనదైన ఆన్సర్ ఇచ్చి మరింత ఆజ్యం పోశారు. ఈ ఇంటర్వ్యూలో లోకేష్ కి ఎదురైన ప్రశ్న ఏంటి అంటే 2024లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అని. అలాగే పవన్ కి సీఎం పవర్ లో షేరింగ్ ఇస్తారా అని.

దానికి లోకేష్ క్లారిటీగా జవాబు ఇచ్చేశారు. చంద్రబాబే సీఎం రెండవ ఆలోచన లేదు. ఆయన అయిదేళ్ళు పూర్తి కాలం సీఎం గా ఉంటారు అని చెప్పేశారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కూడా అనుభవం కలిగిన నాయకుడు సమర్ధ నాయకుడు ఏపీకి కావాలని కోరారని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ ఏ ఉద్దేశ్యంలో అన్నారో తెలియదు కానీ ఆయన్ని కూడా తీసుకుని వచ్చి బాబే సీఎం అంటూ కూటమి సొగసు ఏంటో చెప్పేశారు, గుట్టు విప్పేసారు.

ఇదే ఇపుడు బయట మంట రాజేస్తోంది. జనసేనకు శ్రేయోభిలాషిగా ఉన్న పెద్దాయన మాజీ మంత్రి హరి రామజోగయ్య వెంటనే పవన్ కి బహిరంగ లేఖ రాశారు. లోకేష్ చెప్పిందే నిజమా అని ఆయన ప్రశ్న సందించారు. అలాంటపుడు పొత్తుకు అర్ధం ఏమిటి అని నిలదీశారు. బడుగు బలహీన వర్గాలకు వారి ఆశలకు కేంద్ర బిందువుగా పవన్ ఉంటారని అంతా ఆశించారని, పవన్ సీఎం అని అందరూ భావించారని, జనసైనికుల కల అది అని జోగయ్య అంటున్నారు.

మరి పవన్ దీనికి జవాబు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జనసేనలో కూడా ఇపుడు ఆవేశకావేశాలు ఏర్పడుతున్నాయి దీనికి కారణం లోకేష్ చేసిన తాజా వ్యాఖ్యలే అని అంటున్నారు. అదే చంద్రబాబునే ఇలాంటి ప్రశ్న అడిగితే ఆయన ఇచ్చే జవాబు ఎలా ఉంటుందో తెలుసుగా. ఇపుడు సీఎం పదవి ఇవన్నీ కాదు, ముందుకు అయిదు కోట్ల ఏపీ ప్రజల కష్టాలను ఒడ్డున పడేయడం ముఖ్యం. అందుకే టీడీపీ జనసేన కలిశాయని చెబుతారు.

అలా ఆయన నైస్ గా ఇష్యూని దాటేస్తారు అని అంటున్నారు. కానీ లోకేష్ పప్పులో కాలేసి బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలకు చెక్ పెట్టేశారు అని అంటున్నారు. ఇప్పటికే జనసేనకు ఏ పాతిక ఇరవయ్యో సీట్లు ఇస్తారని లీక్స్ వెలువడుతున్న తరుణంలో లోకేష్ అదే నిజం అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో మరో మాట అన్నారు లోకేష్ తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ గా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. అవి వేరే ఏవో కావని, నవరత్నాలకే ఇలా అమలు చేస్తామని అంటున్నారు. అంటే టీడీపీ కొత్తగా ఏ పధకం ఇవ్వడం లేదని లోకేష్ చెప్పినట్లు అయింది అంటున్నారు. ఆ మాత్రం భాగ్యానికి వైసీపీని దించడం ఎందుకు టీడీపీని తలకెత్తుకోవడం ఎందుకు అన్న చర్చ కూడా మొదలవుతోంది.

ఇక టీడీపీ ట్రాక్ రికార్డు చూస్తే 2014లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పక్కన పెట్టేసింది. అందుకే జగన్ పాదయాత్ర చేసి తనదైన హామీలతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఆయన గత అయిదేళ్లుగా వాటిని అమలు చేస్తున్నారు. ఇపుడు టీడీపీకి ఓటేసినా ఒక వేళ హామీలు నెరవేర్చకపోతే సంగతేంటి అన్న చర్చ వస్తోంది అంటున్నారు. మొత్తానికి ఈ విషయంలో కూడా చినబాబు చర్చకు కారణం అవుతున్నారు.

ఈ రెండు ఇష్యూస్ ఇపుడు వైసీపీకి బలమైన ఆయుధంగా మారుతున్నాయని అంటున్నారు. వీటితో వైసీపీ ఒక ఆట ఆడుకోవడం ఖాయమని అంటున్నారు. కాపుల ఓట్లు కూటమికి పోకుండా వైసీపీ ఇప్పటికే చేయాల్సింది చేస్తోంది, ఇపుడు పవన్ సీఎం కాడు అంటూ లోకేష్ చెప్పేశాక అసలు ఊరుకుంటుందా. సో ఇది ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ ఇచ్చిన పవర్ ఫుల్ బ్రహ్మాస్త్రం అని అంటున్నారు.

Tags:    

Similar News