లోక్ సభ ఎన్నికలు ముందుకు... బీజేపీ సక్సెస్ మూడ్
అలాగే చత్తీస్ ఘడ్ లో సీట్లు కలుపుకుంటే మంచి నంబర్ ఉన్న స్టేట్స్ ఇపుడు బీజేపీ చేతిలో ఉన్నాయి.
మూడు రాష్ట్రాలను గెలుచుకుని బీజేపీ మంచి సక్సెస్ మూడ్ లో ఉంది. ఆ అద్భుతమైన విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఉత్తరాదిన తమకు ఏ మాత్రం తిరుగులేదని రుజువు చేసుకుంది. ఈ మూడింటిలో రెండు పెద్ద రాష్ట్రాలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కలుపుకుని యాభైకి పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి. అలాగే చత్తీస్ ఘడ్ లో సీట్లు కలుపుకుంటే మంచి నంబర్ ఉన్న స్టేట్స్ ఇపుడు బీజేపీ చేతిలో ఉన్నాయి.
కాంగ్రెస్ కి 17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే తాజా సక్సెస్ తో దేశంలో 28 రాష్ట్రాలలో పన్నెండు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో ఉంటే తెలంగాణా కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇవన్నీ కలిపినా యాభై ఎంపీ సీట్లు ఉండవు.
దాంతో పాటు నార్త్ లో యూపీ వంటి పెద్ద స్టేట్ కూడా బీజేపీ చేతిలో ఉంది. మహారాష్ట్రలో అధికారం ఉంది. ఈ నేపధ్యంలో లోక్ సభ ఎన్నికల్లో చాలా ఆశలు బీజేపీకి కనిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధ్యమని బీజేపీ నమ్ముతోంది. ఈసారి మా నంబర్ నాలుగు వందల ఎంపీ సీట్లు అని అంటోంది.
అంత రాకపోయినా మెజారిటీ సీట్లు వస్తాయని నమ్ముతోంది. దాంతో ఈ వేడి వాడి గట్టిగా ఉండగానే లోక్ సభకు కొద్ది నెలలు ముందుకు తెచ్చి ఎన్నికలు జరిపించాలని చూస్తోంది. వాస్తవంగా చూస్తే ఏప్రిల్ మే నెలలలో లోక్ సభకు ఏడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. దాని రెండు నెలలు ముందుకు తేవడం అంటే జనవరి ఎండింగులో నోటిఫికేష్ ఇచ్చి ఫిబ్రవరి మాచిలో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగించేలా చూడాలని బీజేపీ సరికొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు.
ఇక మే నెల అంటే చాలా సమస్యలు ఉంటాయి. ఎండలు కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అన్నీ కూడా ఒక్కసారిగా వస్తాయి. అలాగే లేట్ అవుతున్న కొద్దీ విపక్ష కూటమి గట్టిగా బలపడుతుంది అన్న భయాలూ సందేహాలూ ఉన్నాయి. దాంతో ఇపుడు పై చేయిగా బీజేపీ ఉంది కాబట్టి ఎన్నికలకు పోవడమే మంచిది అని ఆలోచిస్తున్నారని టాక్.
ఇక ఇండియా కూటమిలో కూడా లుకలుకలు ఉన్నాయి. కాంగ్రెస్ పెద్దన్న తనాన్ని ఇతర పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో కాంగ్రెస్ పెద్ద రాష్ట్రాలు పోగొట్టుకుంది. దాంతో కాంగ్రెస్ ఇబ్బందులో ఉంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ అధినేత కేజ్రీవాల్, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ, బీహార్ లో నితీష్ కుమార్ వంటి వారు గుర్రుగా ఉన్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో ఇండియా కూటమి ఒక త్రాటి మీదకు రాకుండా ఎన్నికలకు వెళ్తే సో బెటర్ అని బీజేపీ వ్యూహకర్తలు లెక్క వేస్తున్నారుట. మొత్తానికి అన్నీ అనుకూలిస్తే జనవరి నెలాఖరులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు. అలా అనుకుంటే కనుక ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలే ఆఖరువి అని అంటున్నారు. ఢిల్లీ సర్కిల్స్ లో ప్రస్తుతం వినిపిస్తున్న హాట్ హాట్ మ్యాటర్ ఇదే అంటున్నారు.