పవన్, రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఫలితాలు ఇవే!
ఈ సమయంలో... పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం...!
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి మాహయుతి కూటమి మాయ చేస్తోంది! రికార్డ్ స్థాయి స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరోపక్క మహా వికాస్ అఘాడి వెనుకబడిపోయి ఉంది. ఈ సమయంలో... పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం...!
అవును... మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి తరుపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేయగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల సభలు సక్సెస్ అయ్యాయనే కామెంట్లు వినిపించాయి.
ఇందులో భాగంగా... మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య రాజకీయ వివాదం నడుస్తుండగా.. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు.
మరోపక్క మరాఠీలో ప్రసగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన పవన్ కల్యాణ్... ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని.. ప్రతీ ఇంటికీ తాగునీటి సౌకర్యం పనులు జరుగుతున్నాయని.. అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రచారం చేశారు.
ఈ సమయంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇందులో భాగంగా... డెగ్లూర్, బల్లార్ పూర్, షొలాపూర్, పూణె, లాతూర్ నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ స్థానాల్లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించిన ప్రాంతల్లో మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. ఇందులో భాగంగా... షోలాపూర్, నాందేడ్, బోకర్, నయాగావ్ ప్రాంతాల్లోనూ మహాయుతి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.