మహాయుతి 'మ్యాజిక్'... మహారాష్ట్రలో భారీ విక్టరీ దిశగా బీజేపీ!!

ఈ క్రమంలో మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (145) దాటేసింది.

Update: 2024-11-23 05:34 GMT

నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. శనివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (145) దాటేసింది. ప్రస్తుతం 200 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

అవును.. మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ శనివారం ప్రారంభీమైనప్పటి నుంచీ మహాయుతి కూటమి తనదైన మ్యాజిక్ చూపిస్తూనే ఉంది. ఈ సమయంలో మ్యాజిక్ ఫిగర్ దాటటంతో పాటు సుమారు 218 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోతోందన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

తాజా పరిస్థితుల ప్రకారం 218 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి 56 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా... మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం అనే సంగతి తెలిసిందే.

మరోపక్క ఝార్ఖండ్ లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా పరిస్థితి ఉంది. ఇక్కడ జేఎంఎం - బీజేపీ మద్య గట్టిపోటీ నెలకొంది. ఝార్ఖండ్ లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగ... జేఎంఎం నేతృత్వంలోని కూటమి 44 స్థానాలతో ముందంజలో ఉంది. ఇక, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News