జనరేటర్ లో పంచదార... మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ!

గత ఆదివారం చిన్నగా మొదలైనట్లు కనిపించిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం మంగళవారం రాత్రి తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-15 18:33 GMT

గత ఆదివారం చిన్నగా మొదలైనట్లు కనిపించిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం మంగళవారం రాత్రి తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి పాల్పడటం.. అనంతరం ఆయన ఆస్పత్రిలో జాయిన్ అవ్వడం తెలిసిందే. మరోపక్క చిరిగిన చొక్కాతో మనోజ్ కనిపించడం వైరల్ గా మారింది.

అంతకంటే ముందు తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని.. తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయగా.. మనోజ్ తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మరోపక్క కమిషనర్ ముందు విచారణకు హాజరుకావాలంటూ మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు నోటీసులు అందాయి. ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇదే సమయంలో... గత మూడు నాలుగు రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవకు సంబంధించిన విషయాలు పెద్దగా కనిపించడం లేదు! మరోపక్క మోహన్ బాబు.. తన దాడిలో గాయపడిన జర్నలిస్టును యశోద ఆస్పత్రిలో పరామర్శించి సారీ చెప్పారు. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఈ సారి మనోజ్ వర్సెస్ విష్ణు అనే టాపిక్ తెరపైకి వచ్చిందని అంటున్నారు.

అవును... మంచు మనోజ్ ఫ్యామిలీ వ్యవహారం పోలీసుల జోక్యంతో కాస్త సద్దుమణిగిందనే చర్చ నడుతున్న వేళ మరో కీలక పరిణామ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... శనివారం రాత్రి జల్ పల్లిలోని ఇంట్లో మోహన్ బాబు భార్య బర్త్ డే పార్టీ జరిగిందని.. ఆ సమయంలో కరెంట్ ఆగిపోయిందని చెబుతున్నారు.

ఆ సమయంలో జనరేటర్ ను ఆన్ చేసి చూడగా ఆన్ కాలేదని అంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉదయం జనరేటర్ ను పరిశీలించగా.. అందులో పంచదార ఉన్నట్లు తెలిసిందని అంటున్నారు. ఈ సమయంలో విష్ణు, మరికొంతమంది కలిసి జనరేటర్ లో పంచదార పోసినట్లు గుర్తించారని చెబుతున్నారు.

దీంతో... ఈ వ్యవహారంపై పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... తనతో పాటు కుటుంబ సభ్యులను కరెంట్ ఫిక్షన్ చేసి హతమార్చాలనే కుట్ర చేశారని.. తనతో పాటు భార్య, పిల్లలు, తన తల్లిని చంపే ప్రయత్నం జరుగుతుందని చెప్పారని అంటున్నారు.

ఇదే సమయంలో... వారం రోజుల క్రితం తాను ఫిర్యాదు చేసిన వ్యక్తులే ఇప్పుడు తమ ఇంట్లోకి వచ్చి కుట్ర చేశారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News