పేలిన మావోయిస్టుల మందుపాతర... ఛత్తీస్ గఢ్ లో దారుణం!
ఈ నేపథ్యంలో సోమవారం కూడా మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్న సమయంలో ఓ దారుణం చోటు చేసుకుంది. మావోల మందుపాతర పేలింది.
మావోయిస్టు రహిత భారత్ తమ లక్ష్యం అంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న నేపథ్యంలో.. గత కొన్నాళ్లుగా ఛత్తీస్ గఢ్ లో వీరి ఏరివేతను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా... శనివారం అర్థరాత్రి ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాలను అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్న సమయంలో ఓ దారుణం చోటు చేసుకుంది. మావోల మందుపాతర పేలింది.
అవును.. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాటుకానికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా.. కుత్రు అటవీ ప్రాంతంలో 15 మంది భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాత్ర పెట్టి పేల్చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అంటున్నారు.
ఈ ఇంప్రొవైస్డ్ ఎక్స్ పోజివ్ డివైజెస్ (ఐఈడీ) పేలిన సమయంలో ఆ వాహనంలో 15 మంది ఉండగా.. తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్న మిగిలిన ఆరుగురిని బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు.
జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ కుత్రు అటవీ ప్రాంతంలోని ఓ మార్గం వద్దకు రాగానే.. భారీ మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. దీంతో.. ఆ రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఇక భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనం తుక్కుతుక్కైపోయింది. ఆపరేషన్ అనంతరం తిరిగి వెళ్తుండగా దారిలో కాపు కాసిన మావోలు ఈఐడీని పేల్చినట్లు చెబుతున్నారు.
ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ - దంతేవాడ జిల్లా సరిహద్దులోని దక్షిణ అబుజ్ మర్ అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ జరిగిందని అబిజీ తెలిపారు. నారాయణ పూర్, జగదల్ పూర్, కొండగావ్, దంతేవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) బృందాల సమన్వయంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్.టీ.ఎఫ్.) దీన్ని నిర్వహించింది!