ట్రంప్ వ్యాఖ్యలపై మెలోని యాంగిల్ వేరప్పా

ఎప్పుడెప్పుడు అమెరికా అధ్యక్ష స్థానాన్ని సొంతం చేసుకోవాలని.. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా దేశానికి తిరుగులేని అధినేతగా రెండోసారి పదవిని చేపట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ ఎంతలా ఆరాటం చెందుతున్నారు?

Update: 2025-01-10 06:30 GMT

ఎప్పుడెప్పుడు అమెరికా అధ్యక్ష స్థానాన్ని సొంతం చేసుకోవాలని.. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా దేశానికి తిరుగులేని అధినేతగా రెండోసారి పదవిని చేపట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ ఎంతలా ఆరాటం చెందుతున్నారు? అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పదవీ కాలంలో తాను పూర్తి చేయాలనుకున్న అంశాల్ని.. తాను పదవిని చేపట్టిన తర్వాత చెప్పటం ద్వారా టైం వేస్టు అవుతుందని భావిస్తున్న ఆయన.. ఎన్నికల్లో గెలుపును సొంతం చసుకున్న తర్వాత నుంచి వరుస పెట్టి.. తన ఫ్యూచర్ ఎజెండాను ఓపెన్ గా చెప్పేయటం తెలిసిందే.

గ్రీన్ లాండ్.. పనామా కాలువను అమెరికాలో విలీనం చేసుకోవటం.. కెనడా.. మెక్సికోలను అమెరికాలో కలిపేసుకోవటం ద్వారా అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తామంటూ.. తరచూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. పలు దేశాధినేతలకు చురుకు పుట్టిస్తున్నారు. యూరోపియన్ దేశాలపైనా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వారు సైతం అసంత్రప్తికి గురవుతున్నారు. ఇలాంటి వేళ.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఇప్పటివరకు వచ్చిన విశ్లేషణలకు భిన్నంగా రియాక్టు అయ్యారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ట్రంప్ వ్యాఖ్యల సారాంశాన్ని ఆమె చెప్పిన యాంగిల్ సరికొత్తగా మారాయి.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి హాజరు కావాలని భావిస్తునన మెలోని.. ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు. గ్రీన్ లాండ్.. పనామా కాలువలను అమెరికాలో విలీనం చేసుకోవటం వెనుక.. ఈ తరహా వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్న చైనా.. తదితర దేశాలకు ట్రంప్ హెచ్చరిక జారీ చేశారన్నారు. ట్రంప్ చెప్పిన మాటల్ని నిజం చేసేందుకు సైనిక శక్తిని ఉపయోగిస్తారని తాను అనుకోవటం లేదన్నారు. తనకు ఆసక్తి ఉన్న భూభాగాన్ని భవిష్యత్తులో ఆక్రమించుకోవటానికి అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగిస్తుందని తాను అనుకోవటం లేదని.. ఆ దేశాలపై పెత్తనం చెలాయించుకునే దేశాలకు ఒక సందేశం ఇచ్చేందుకు వీలుగా ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ట్రంప్ హెచ్చరికల వెనుక.. పనామా కాలువ.. గ్రీన్ ల్యాండ్ లో చైనా అధిపత్యం పెరగటం కారణంగా కనిపిస్తుందన్నారు. మొత్తంగా ట్రంప్ వ్యాఖ్యలపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఇటలీ ప్రధాని మాత్రం మిగిలిన వారికి భిన్నమైన వాదనను తెర మీదకు తీసుకురావటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మరి.. ఇటలీ ప్రధాని మెలోని వ్యాఖ్యలపై మిగిలిన వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News