ఎమ్మెల్యే రాజాసింగుకు షాక్.. సోషల్ మీడియా అకౌంట్లు క్లోజ్

హిందువులే టార్గెట్ గా సెలక్టడ్ సెన్సార్ షిప్ నడుస్తోందని ఆరోపించారు.

Update: 2025-02-21 09:38 GMT

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగుకు టెక్ దిగ్గజం మెటా షాక్ ఇచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజాసింగ్ వీడియోలు, కంటెంట్ ఉంటున్నాయనే అభ్యంతరాలతో ఆయన ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్లను తొలగించింది. ఇండియా హేట్ ల్యాబ్ అనే సంస్థ ఇచ్చిన నివేదక ప్రకారం రాజాసింగ్ అకౌంట్లపై వేటు వేస్తున్నట్లు చెప్పింది. మెటా చర్యలను రాజాసింగ్ ఖండించారు. హిందువులే టార్గెట్ గా సెలక్టడ్ సెన్సార్ షిప్ నడుస్తోందని ఆరోపించారు.

హైదరబాద్ నగరంలోని గోషామహల్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన బీజేపీ నేత రాజాసింగ్ వివాదాస్పద నాయకుడిగా ముద్రపడ్డారు. ఆయన ప్రసంగాలు ఓ మతానికి అనుకూలంగా మరో మతానికి వ్యతిరేకంగా ఉంటాయని చాలా కాలం నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో కూడా ఆయన విద్వేష ప్రకటనలతో బీజీపీ సస్పెండ్ చేసింది. ఎన్నికల ముందు తిరిగి పార్టీలో చేర్చుకున్నా, ఆయన ధోరణిలో మార్పు రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా రంజాన్ పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. హిందువులు పండగలకు ఆంక్షలు విధించి, ముస్లింల పండుగలకు పని గంటల్లో వెసులుబాటు కల్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై ఓ వీడియో విడుదల చేయడంతో అది వైరల్ అయింది.

అంతేకాకుండా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వీడియో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేవిధంగా ఉందంటూ ఇండియా హేట్ ల్యాబ్ అనే సంస్థ మెటాకు నివేదిక ఇచ్చింది. దీంతో రాజాసింగ్ అకౌంట్లను తొలగిస్తూ మెటా నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్ ఫేస్ బుక్ అకౌంట్ ను 10 లక్షల మంది, ఇన్ స్టా అకౌంట్ ను 1.50 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

Tags:    

Similar News