వేటు: కంప్లైంట్ చేసేందుకు వస్తే కన్నేసిన మియాపూర్ ఎస్ఐ

స్టేషన్ కు కంప్టైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళ పట్ల అగౌరవంగా వ్యవహరించటమే కాదు.. ఆమెకు అదే పనిగా ఫోన్లు చేస్తూ.. వెంట పడిన వైనం షాకింగ్ గా మారింది.

Update: 2023-12-27 06:17 GMT

తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఒక బాధితురాలి విషయంలో మియాపూర్ ఎస్ఐ వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది అని ఆరోపనులు వచ్చాయి . తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ కు కంప్టైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళ పట్ల అగౌరవంగా వ్యవహరించటమే కాదు.. ఆమెకు అదే పనిగా ఫోన్లు చేస్తూ.. వెంట పడిన వైనం షాకింగ్ గా మారింది అని అంటున్నారు . ఈ ఉదంతంపై తనకు వచ్చిన ఫిర్యాదుపై వేగంగా స్పందించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి చర్యలు చేపట్టారు. సదరు ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.పూర్తి విచారణకు కూడా ఆదేశించారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న గిరీష్ కుమార్ 2020 బ్యాచ్ కు చెందిన అధికారి. ఇటీవల తనను ఆర్థికంగా మోసం చేసిన వ్యక్తి గురించి ఫిర్యాదు చేసేందుకు బ్యూటీషియన్ గా పని చేసే ఒక మహిళ స్టేషన్ కు వచ్చారు. రూ.ఆరు లక్షల వరకు మోసం జరిగినట్లుగా చెప్పుకున్న సదరు బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ.. ఆ మొత్తాన్ని రికవరీ చేయించారు.

కేసు ముగిసిన తర్వాత నుంచి సదరు బ్యూటిషియన్ వెంట పడటం మొదలు పెట్టారు. ఆమె ఫోన్ నెంబరుకు పదే పదే ఫోన్ చేయటం.. అసభ్యంగా ప్రవర్తించిన అతడి తీరుతో విసిగిపోయిన ఆమె.. సైబరాబాద్ సీపీని నేరుగా కలిసి కంప్లైంట్ చేశారు. వెంటనే..ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. తమ విచారణలో ఎస్ఐ గిరీష్ కుమార్ పై వేటు వేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. న్యాయం కోసం వచ్చిన మహళ పట్లఇలా వ్యవహరించటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News