మోడీ వ్యూహం: జమిలి 'బాంబు' ఎప్పుడైనా!!
దీనిని బట్టి.. ఇప్పుడు కూడా జమిలి విషయంలో ఎప్పుడైనా అమలు చేయొచ్చు. తాజాగా జరిగిన ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా రెండు విషయాలను ఆయన చర్చించారు.
ఒక దేశం-ఒకే ఎన్నికలు.. నినాదంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. అయితే.. ఈ జమిలి ఎన్నికలు ఎప్పుడు వస్తాయనే విషయంపై కేంద్రం చాలా గుంభనంగా ఉంది. అసలు ప్రధాని మోడీని గమనిస్తే.. ఆయన చేయాలనుకున్న కీలక విషయాలను చాలా గుంభనంగా ఉంచుతారు. ఎవరికీ చెప్పరు. కనీసం.. తనకు అత్యంత ఆప్తుడైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా చెప్పని అనేక విషయాలు ఉన్నాయి.
గతంలో(2016) కూడా పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు హఠాత్తుగా ప్రధాన మంత్రి మోడీ ప్రకటించారు. ఈ విషయం కేంద్ర మంత్రులకు కూడా చెప్పలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా కరోనా సమయంలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు కూడా ఇలానే చేశారు. ఇప్పుడు కూడా జమిలి విషయంలో పెద్దగా క్లారిటీ లేదు. ఏక్షణమైనా ఈ ఎన్నికలు జరగొచ్చు. అయితే.. దీనికి ఉన్న ప్రాతిపదిక మాత్రం.. జమిలికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించడమే.
ఒక్కసారి కనుక పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందితే.. అప్పటి నుంచి 2029లోపు జమిలికి రెడీ కావాల్సిందే. సో.. దీనిని బట్టి.. 2029ని 'జమిలి రేఖ'గా పెట్టుకుంటే.. ఈ లోగా ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు. కాబట్టి ..జమిలికి రెడీ అవుతున్నారని చెప్పుకొనే వారు.. ఖచ్చితంగా ఈ లోగానే రెడీ అవ్వాలి. మోడీకి ఉన్న ప్రధాన లక్షణాల్లో తాను అమలు చేయాలని అనుకున్న కొన్ని విషయాలను మాత్రమే మిత్రపక్షాలకు చెబుతారు. గతంలో 3- వ్యవసాయ చట్టాలను మిత్రపక్షాలకు చెప్పకుండానే తీసుకువచ్చా రు.
దీనిని బట్టి.. ఇప్పుడు కూడా జమిలి విషయంలో ఎప్పుడైనా అమలు చేయొచ్చు. తాజాగా జరిగిన ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా రెండు విషయాలను ఆయన చర్చించారు. 1) జమిలి. 2) యూనిఫాం సివిల్ కోడ్. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది ఆయన ఉద్దేశం. యూనిఫాం సివిల్ కోడ్‌ను ఇప్పటికే ఆమోదించినా.. పలు రాష్ట్రాలు ఇంకా దీనిని ఎడాప్ట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు.
ఇక, జమిలికి అందరూ సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోడీ మనసు ఎప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుందన్నది ఎవరూ చెప్పలేక పోతుండడం గమనార్హం. కాబట్టి రాష్ట్రాలన్నీ.. ఎన్నికల దిశగా రెడీ కావడం ఉత్తమం. మహా అయితే.. ఆరు నుంచి ఏడాది సమయం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు భావిస్తున్నారు.