వారణాసిలో మోడీ వెనుకంజ

ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఉదయం 10 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నారు.

Update: 2024-06-04 04:57 GMT

2024 సార్వత్రిక ఎన్నిక ఎన్డీఏ ఘనవిజయం సాధించబోతుందని, 400 సీట్లతో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో వెల్లడైన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టి మోడీ హ్యాట్రిక్ కొడతారని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. భారత మాజీ ప్రధాని, దివంగత నేత జవహర్ లాల్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ కొట్టిన ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారని బిజెపి నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఉదయం 10 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కన్నా మోడీ 6233 ఓట్లు వెనుకబడి ఉన్నారు. ఉదయం 10 గంటల సమయానికి రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి అజయ్ రాయ్ కు 11480 ఓట్లు రాగా ప్రధాని మోడీకి 5257 ఓట్లు వచ్చాయి. దీంతో, బీజేపీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి. అయితే, మూడో రౌండ్ పూర్తయ్యే సరికి మోడీ పుంజుకొని 9 వేల ఓట్ల ఆధిక్యంలోకి రావడంతో బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News