45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోడీ... ఆహారం ఏమంటే...?

దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముగిసాయి. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగబోతుంది.

Update: 2024-05-31 06:35 GMT

దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముగిసాయి. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగబోతుంది. ఈ 7వ విడత ఎన్నికల్లో మోడీ పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం మోడీ సుదీర్ఘ ధ్యానంలో ఉన్నారు. అంటే... ధ్యానంలోనే ఆయన సేదతీరుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

అవును... సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించిన మోడీ.. ప్రస్తుతం ధ్యానంతో సేదతీరుతున్నారు. ఇందులో భాగంగా... తమిళనాడులోని కన్యాకుమారిలో వెలసిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఆయన సుమారు 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... ప్రస్తుతం మోడీ సుధీర్ఘ ధ్యానం ప్లాన్ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6:45 గంటల సమయంలో మోడీ ధ్యానం ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం వంటి ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇదే సమయంలో ధ్యానంలో ఉండాలనుకుంటున్న 45 గంతలూ ఆయన మౌనంగానే ఉంటారని, మెడిటేషన్ హాల్‌ నుంచి బయటకు రారని తెలిపాయి. ఈ క్రమంలో ఆయన కాషాయ దుస్తులు ధరించి, ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

కాగా... లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన అనంతరం పంజాబ్‌ నుంచి బయలుదేరిన మోడీ... నేరుగా తమిళనాడు చేరుకుని, అక్కడున్న భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలాస్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు.

ఈ సమయంలోనే వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడ సుమారు 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ధ్యానం చేశారని చెబుతున్నారు.

Tags:    

Similar News