మోహన్ బాబు తిరుపతి నుంచి దుబాయ్ వెళ్లిపోయారా?

మంచు ఫ్యామిలీ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-24 07:42 GMT

మంచు ఫ్యామిలీ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్.. మనోజ్ తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఇదే క్రమంలో తాజాగా విష్ణుతో తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ మరో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

అయితే.. ఈ వ్యవహారంలో జల్ పల్లి లోని ఆయన నివాస ఆవరణలో మోహన్ బాబు దాడి చేయడంతో.. జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు షాకిచ్చింది.

ఇందులో భాగంగా... జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా... మోహన్ బాబు అనారోగ్యంతో ఉన్నారని.. గుండె, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారని అంటున్నారు.

ఇదే సమయంలో... ఇటీవల తన మనవడిని కలిసేందుకు దుబాయ్ వెళ్లొచ్చిన మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నారని.. అక్కడ ఉన్న విద్యాసంస్థల బాధ్యతలు చూస్తున్నారని తెలిపారని అంటున్నారు. ఈ సమయంలో.. ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.

అవును... హైకోర్టు ఈ నెల 24 వరకూ మోహన్ బాబు విచారణ, అరెస్టు వంటి వాటి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెబుతున్న నేపథ్యంలో.. ఆ గడువు నేటితో ముగుస్తుంది. మరోపక్క ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

దీంతో.. మోహన్ బాబును ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగాణాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అరెస్టు ముప్పు ఉందనే ఆలోచనతో, తదుపరి న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకునేవరకూ మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారా అనే చర్చ జరుగుతుందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... మోహన్ బాబు దుబాయ్ వెళ్లిపోయారనే చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీంతో.. అదే నిజమైతే మోహన్ బాబు మరో తప్పు చేసినట్లే అని పోలీసులు అంటున్నారని తెలుస్తోంది. కాగా.. తన దాడిలో గాయపడిన జర్నలిస్టును హాస్పటల్ కు వెళ్లి మోహన్ బాబు పరామర్శించిన సంగతి తెలిసిందే.

ఇలా పోలీసులకు సమాచారం, వారి అనుమతి లేకుండా ఆస్పత్రిలో ఉన్న బాధితుడ్ని పరామర్శించి మోహన్ బాబు ఒక తప్పుచేశారని.. ఇప్పుడు నిజంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్తే మరో తప్పు చేసినట్లేనని అంటున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News