మనోజ్ ఫిర్యాదు.. మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్!!
ఈ సమయంలో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మోహన్ బాబు కుటుంబ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి మొదలైన ఈ వ్యవహారం మంగళవారం రాత్రికి పీక్స్ కి చేరిన పరిస్థితి అని అంటున్నారు. ఈ సమయంలో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిరణ్ అనే వ్యక్తికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అవును... మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తూ.. తన నివాసానికి వచ్చి పది మంది దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు! ఇదే సమయంలో.. తనపై దాడి జరిగిన సమయంలో విజయ్, కిరణ్ అనే వ్యక్తులు వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేసినట్లు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జల్ పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్ ని అదుపులోకి తీసుకున్నట్లూ తెలుస్తోంది. ఇదే సమయంలో మాయమైన సీసీటీవీ ఫుటేజ్ పైనా పోలీసూ విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో ఇప్పటికే విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో వీరిద్దరినీ విచారిస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మొదటి నుంచీ మనోజ్ చెబుతున్నట్లు.. ఈ కేసులో సీసీటీవీ విజువల్స్ కీలక భూమిక పోషించే అవకాశం ఉందని అంటున్నారు.