'మహా కుంభ్ మోనాలిసా' ఇళ్లు ఇదే... వీడియో వైరల్!
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే కోట్లాదిమంది పుణ్యస్నానాలు చేశారు. ఇక ఇక్కడ సాధువులు, సన్యాసులు, అఘోరీలు ప్రత్యక ఆకర్షణగా నిలుస్తున్నారని అంటున్నారు.
వారికి సంబంధించిన విషయాలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ సమయంలో ఇదే కుంభమేళాలో ఓ అమ్మాయి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇండోర్ కు చెందిన మోనాలిసా భోంస్లే దండలు విక్రయిస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియో నెట్టింట దర్శనమివ్వడం.. వైరల్ అయ్యింది.
ప్రధానంగా ఆమె డస్కీ స్కిన్ టోన్ తో పాటు పెద్ద పెద్ద కళ్లు, మనోహరమైన ముఖం, అమాయకత్వంతో కూడిన చిరునవ్వు నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసిందని చెబుతున్నారు. ఆమె నిజంగా నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఆమెను "మహా కుంభ్ మోనాలిసా" అంటూ అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన ఇంటిని చూపించింది.
అవును... కుంభమేళా మోనాలిసాగా పాపులర్ అయిన అమ్మాయి తాజాగా ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో భాగంగా.. తన ఇంటిని చూపించింది.. తానుంటున్న గ్రామంలో సుమారు 100 మంది వరకూ ఉంటారని తెలిపింది. ఈ సమయంలో... తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని వాపోయింది.
ఇదే సమయంలో తనకు సోషల్ మీడియాలో ఇంత గుర్తింపు రావడానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. దీంతో.. మోనాలిసా పేరు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సమయంలో ఆమె ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అవ్వడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.