వైరల్ వీడియో: 30 నిమిషాల్లో ఢిల్లీ టు అమెరికా.. ఏమిటీ ప్రాజెక్ట్?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లడానికి ఎంత టైం పడుతుంది అనేది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే... కేవలం 30 నిమిషాల్లో ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లగలిగితే ఎలా ఉంటుంది? ఆ కథే వేరే అన్నట్లుగా ఉంటుంది కదా! అసలు ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది.. ఎవరికి వచ్చింది.. అసలేమీ కథ అనేది ఇప్పుడు చూద్దాం...!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో మస్క్ పాత్ర కీలకం అనే చెప్పాలి. ట్రంప్ కోసం ప్రచారం చేస్తూ.. ఆర్థికంగానూ చాలా కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరిలో ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈలోపు తన టీమ్ ఏర్పాట్లపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా... బిలియనీర్ ఎలాన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సమయంలో అగ్రరాజ్యంలోని ట్రంప్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రాజెక్టులు ప్రారంభించగలరని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక విషయం తెరపైకి వచ్చింది.
అవును.. ట్రంప్ టీమ్ లో కీలక పాత్ర పోషించబోతోన్న ఎలాన్ మస్క్ తన సంస్థ స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభం చేయడానికి.. తక్కు వసమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడం వంటి ఓ కీలక ప్రాజెక్ట్ కూడా ఉందని అంటున్నారు. ఇది కార్యరూపం దాల్చి సెక్సెస్ అయితే... ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణం గంటలోపుకు మారుతుందని అంటున్నారు.
ఇందులో భాగంగా... ఢిల్లీ నుంచి అమెరికాకు కేవలం అరగంటలో చేరుకోవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన స్పెస్ ఎక్స్ స్టార్ షిప్ ను స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేసి, దాని సహాయంతో క్షణాల్లో ఒక ప్రదేశం నుంచి అమ్రో ప్రదేశానికి చేరుకోగలుగుతారని అంటున్నారు. అంటే... తన స్టార్ షిప్ తో భూమిపై ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి అంతరిక్ష తరహా ప్రయాణాన్ని పరిచయం చేయనున్నారన్నమాట!
ఇక ప్రాజెక్ట్ వివరాళ్లోకి వస్తే... ఈ స్టార్ షిప్ సుమారు 395 అడుగుల పొడవు ఉంటుందని.. ఇది గంటకు 16,700 మైళ్ల వేగంతో ప్రయాణించగలదని.. దీనిలో సుమారు వెయ్యి మంది ప్రయాణికులకు సిటింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో దీనికి సంబంధించిన ఓ వీడియో ఎక్స్ లో పోస్ట్ అయ్యింది. ఇది ఎలా పనిచేస్తుందో ఆ వీడియోలో చూపించారు.
ఇందులో తెలిపిన వివరాల ప్రకారం.. 22 నిమిషాల్లో హాంకాంగ్ నుంచి సింగపూర్.. లాస్ ఏంజిలెస్ నుంచి టొరంటో కి 24 నిమిషాలు.. బ్యాంకాక్ నుంచి దుబాయ్ కి 27 నిమిషాలు.. టోక్యో నుంచి సింగపూర్ 28 నిమిషాలు.. లండన్ నుంచి దుబాయ్ 29 నిమిషాలు.. సిడ్నీ నుంచి టోక్యో 35 నిమిషాలు.. న్యూయార్క్ నుంచి టోక్యో 37 నిమిషాల్లో చేరుకోవచ్చు.