అమరావతి రాజధాని మీద నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఇపుడు మరోసారి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తన ప్రయారిటీలలో ఫస్ట్ గానే అమరావతి రాజధానిని పెట్టుకుంది.

Update: 2024-09-16 13:55 GMT

ఏపీకి రాజధానిగా అమరావతిని తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసింది. తొలి టెర్మ్ లో అన్నీ టెంపరరీ భవనాలే కట్టింది. ఈలోగా వైసీపీ వచ్చి మూడు రాజధానులు అంటూ అమరావతి కధను మార్చాలని చూసింది. అయితే అయిదేళ్ల కాలంలో అది పెద్దగా ముందుకు సాగలేదు. ఇపుడు మరోసారి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తన ప్రయారిటీలలో ఫస్ట్ గానే అమరావతి రాజధానిని పెట్టుకుంది.

దానికి తగిన విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగుతుండగా ఇటీవల వచ్చిన వరదలతో మొత్తం అమరావతి రాజధాని మునిగిపోతుందని ప్రచారం సాగింది. దాంతో అమరావతి మీద చాలానే ఆలోచనలు జరుగుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అమరావతి రాజధాని విషయంలో చెడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని కూడా స్పష్టం చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే అమరావతి రాజధాని సేఫ్ జోన్ లో ఉందని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అంటున్నారు. క్రిష్ణా నది వల్ల కూడా అమరావతికి ఎలాంటి ముప్పు లేదని ఆయన చెబుతున్నారు ఈ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అని అన్నారు.

అమరావతి రాజధానిలో కాలువలు రిజర్వాయర్లు పెద్ద ఎత్తున నిర్మిస్తామని దాని వల్ల ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వ హయమలో నిర్మించిన ఐకానిక్ భవనాలు,క్వార్టర్లు కు ఎలాంటి ఇబ్బంది లేదని ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చారని ఆయన చెప్పారు.

అయినా అమరావతి మునిగిపోతుందని చెప్పడం రాజకీయ దురుద్దేశంతోనే అని ఆయన అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణానదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదని మంత్రి అంటున్నారు. అంతే కాదు అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు,రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశామని ఆయన చెప్పారు

అమరావతి పక్కన ఉన .కొండవీటి వాగు,పాల వాగుల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేశామని మంత్రి చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఆయన అన్నారు. అంతే కాకుండా గత వందేళ్లలో కృష్ణా నదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.

వీటితో పాటు మరో ఆరు రిజర్వాయర్లు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఎంత వర్షం వచ్చినా సరే కాలువలు,రిజర్వాయర్లలోనే ఆ నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలా కాదని ఒకవేళ ఇవి నిండిపోయినా సరే కృష్ణా నదిలోకి పంపింగ్ చేసేందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నట్లు మంత్రి చెప్పారు.

మరో వైపు చూస్తే 12,350 క్యూసెక్కుల కెపాసిటీ తో ఉండవల్లి వద్ద,4000 క్యూసెక్కుల కెపాసిటీ తో బకింగ్ హాం కెనాల్ లోకి,5650 క్యూసెక్కుల కెపాసిటీ తో వైకుంఠపురం వద్ద లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇవన్నీ కూడా పూర్తయితే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క కూడా నీరు నిల్వ ఉండదని నారాయణ చెప్పారు.

అమరావతి స్ట్రాంగ్ గా ఉన్న నేల అని అందుకే గతంలో నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినా అయిదేళ్ల వైసీపీ పాలన తరువాత కూడా అవి ఇంకా పటిష్టంగానే ఉన్నాయని ఐఐటీ నిపుణుల నివేదిక తెలియచేసింది అని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి అమరావతికి వరదలు రావు అని చుక్క నీరు కూడా వచ్చే సీన్ లేదని నారాయణ అంటున్నారు మరి దీని మీద వైసీపీ వారి వాదనలు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News