అసలుసిసలు భారతదేశం ఇదే.. అయోధ్యలో రేర్ సీన్

ఈ సందర్భంగా ఆయన్ను పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు

Update: 2023-12-31 04:49 GMT

కోట్లాట ఏదైనా వాదన వినిపించటానికే. ఒకసారి కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మిగిలిన విషయాల్ని వదిలేయటం లాంటి పెద్ద మనసు కొందరికే ఉంటుంది. అందునా యావత్ దేశమే కాదు ప్రపంచం సైతం ఆసక్తిగా ఎదురుచూసిన ఒక ఉదంతంలో తన వాదన మీద నిలబడి దశాబ్దాల తరబడి పోరాడిన పెద్ద మనిషి.. దేశ ప్రధాని తన ఇంటి మీదుగా వెళుతున్న వేళ.. స్పందించిన తీరు చూస్తే.. అసలుసిసలు భారతదేశం అంటే ఇదేరా? అన్న భావన కలుగక మానదు. అయోధ్యలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం చూస్తే.. భిన్నత్వంలో ఏకత్వం అన్న మాట అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందని చెప్పాలి.

బాబ్రీ మసీదు (వివాదాస్పద కట్టడం) కేసులో ముస్లిం పక్ష పిటిషనర్లలో ఒకరైనా ఇక్బాల్ అన్సారీ.. శనివారం అయోధ్యకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పూల వర్షం కురిపిస్తూ కనిపించటం ఆసక్తికరంగా మారింది. అయోధ్యలో ఆదునీకరించిన రైల్వేస్టేషన్.. ఎయిర్ పోర్టును ప్రారంభించేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో ఆయన ఇంటి మీదుగా వెళ్లింది. ఈ సందర్భంగా ఆయన రోడ్ మీద నిలబడి పూల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ఆయన్ను పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. మోడీ.. దేశ ప్రధాని అని.. అంటే అందరికి ప్రధానమంత్రి అని పేర్కొన్నారు. అందుకే ఆయన వాహనం మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు గులాబీ పూలతో స్వాగతం పలికినట్లుచెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారన్నారు.

మోడీ వచ్చిన తర్వాత అయోధ్య పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యిందన్న ఆయన.. 'ఇంతకు ముందు చిన్న రైల్వే స్టేషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని మార్చారు. భారీగా నిర్మించారు. ఇక్కడ ఎయిర్ పోర్టు లేదు. ఇప్పుడు దాని నిర్మాణం పూర్తైంది'' అంటూ అయోధ్య డెవలప్ మెంట్ మీద ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అయోధ్యను అనుకొని ఉండే జిల్లాగా చెప్పే సుల్తాన్ పూర్ లో కశ్మీర్ లోని పూంచ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకుల్ని.. ఒక యువతిని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావ.

Tags:    

Similar News