ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్... ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

అవి ఏమేమిటి, ఎలా ఎలా అనేది ఇప్పుడు చూద్దామ్...!;

Update: 2025-03-31 19:33 GMT
ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్... ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

ఈ ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు, కొత్త శ్లాబులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు క్రెడిట్ కార్డు రివార్డులు, యూపీఐ సేవలకు సంబంధించిన నిబంధనలూ మారనున్నాయి. అవి ఏమేమిటి, ఎలా ఎలా అనేది ఇప్పుడు చూద్దామ్...!

అవును... ఇన్ కం ట్యాక్సుకు సంబంధించి కేంద్రం ఇటీవల బడ్జెట్ లో కీలక మార్పులు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలుపుకుంటే.. రూ.12.75 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇదే సమయంలో... విదేశీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేస్తుండగా.. ఇకపై ఈ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. దీంతో.. బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని, ఆ డబ్బు విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్ ఉండదన్నమాట.

మరోపక్క క్రెడిట్ కార్డులపై రివార్డుల్లో ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది.. ఫలితంగా.. ఎయిరిండియా టిక్కెట్లు, స్విగ్గీ బుకింగ్స్ పై లభించే రివార్డులు తగ్గించింది. ఉదాహరణకు ఎస్బీఐ సంప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇప్పటివరకూ స్విగ్గీలో కొనుగోళ్లపై 10ఎక్స్ రివార్డులు పొందుతుండగా.. ఏప్రిల్ 1 నుంచి 5ఎక్స్ రివార్డు పాయింట్లు మాత్రమే అందుకుంటారు.

ఇదే సమయంలో ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇప్పటివరకూ ఎయిరిండియా టికెట్ బుకింగ్స్ పై ప్రతి రూ.100కు 15 రివార్డు పాయింట్లు పొందుతుండగా.. ఇకపై 5 రివార్డు పాయింట్లు.. ఎస్బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు హోల్డర్లు ప్రతీ రూ.100 ఖర్చుపై పొందే 30 పాయింట్లు కాస్తా ఇకపై 10 రివార్డు పాయింట్లకు ఎస్బీఐ కుదించింది.

అదేవిధంగా... ఇన్ యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సీ.ఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ సేవల్లో ఓటీపీ వెరిఫికేషన్ కీలక భూమిక పోషిస్తుండటం వల్ల ఎన్.పీ.సీ.ఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్.పీ.ఎస్. వాత్సల్య పథకం చందాదారులకు కేంద్రం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్.పీ.ఎస్. చందాదారుల తరహాలో సెక్షన్ 80సీసీడీ (1బి) కింద పన్ను ప్రయోజనాలను కల్పించారు. ఎన్.పీ.ఎస్. వాత్సల్య పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో పన్ను ప్రయోజనాలను జోడించింది.

Tags:    

Similar News