అదిరే టెక్నాలజీని తీసుకొచ్చిన చైనావోడు

ఈ విధానంలో ఇప్పటివరకు మనకున్న పద్దతులకు భిన్నంగా కలలో కూడా ఊహించలేని సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చేశాడు.

Update: 2024-10-25 11:30 GMT

ఏదైనా షాపు లేదంటే సూపర్ మార్కెట్.. కాదంటే హైపర్ మాల్ కు వెళ్లామనుకోండి. కావాల్సిన వస్తువులు కొన్నాక బిల్ కౌంటర్లో బిల్ వేసిన తర్వాత డబ్బు చెల్లింపు అయితే క్యాష్ లేదంటే.. క్రెడిట్ కాదంటే.. కాదంటే మొబైల్ లోని యూపీఐ పేమెంట్ చేసి బయటకు వస్తుంటాం. ఇప్పటివరకు మనకు తెలిసింది ఇదే. అయితే.. మన పక్కనున్న చైనావోడు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చేశాడు. ఈ విధానంలో ఇప్పటివరకు మనకున్న పద్దతులకు భిన్నంగా.. కలలో కూడా ఊహించలేని సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చేశాడు.

అరచేతితో పేమెంట్ చేసేలా టెక్నాలజీని రూపొందించాడు. అదెలా సాధ్యమన్న సందేహం రావొచ్చు. అయితే.. వారు డెవలప్ చేసిన టెక్నాలజీ గురించి తెలిస్తే.. ఔరా అనాల్సిందే. పాకిస్థాన్ కు చెందిన రానా హంజా సైఫ్ అనే కంటెంట్ క్రియేటర్ చైనాలోని జాజౌ పట్టణంలోని ఒక స్టోర్ లో ఈపామ్ పేమెంట్ సిస్టం ద్వారా చెల్లింపులు జరుగుతున్న వైనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో.. తన చేతిని కూడా స్కాన్ చేయించుకొని రిజిస్టరర్ చేసుకున్నారు. ఆ తర్వాత తన చేతితోనే చెల్లింపులు చేశారు. దీన్ని వీడియోగా సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది.

అరచేతి ద్వారా చెల్లింపులు చేయాలంటే యూపీఐ యాప్స్ తరహాలోనే కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మన అరచేతిని ప్రత్యేకంగా స్కాన్ చేయించాలి. ఆ తర్వాత ఆ స్కాన్ చేసిన అరచేతి నకలును బ్యాంకు ఖాతాకు ఇంటర్ లింక్ చేయాలి. బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసిన మొబైల్ నెంబరుతో కూడిన యాప్ లో రిజిస్టర్ కావాలి. ఇలా రిజిస్ట్రేషన్ ఒకసారి పూర్తి అయితే.. ఎక్కడైనా సరే.. డబ్బులు చెల్లించే పరిస్థితి ఉన్న ప్రతి చోటా.. అరచేతిని చూపించి డబ్బులు చెల్లించే వీలు ఉంటుంది.ఈ తరహా టెక్నాలజీ ఒక్క చైనాలోనే అమల్లో ఉందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. చైనావోడు 2050లో ఉన్నట్లు అనిపించట్లేదు?

Tags:    

Similar News