చైనాను వణికిస్తోన్న కొత్త వైరస్... మళ్లీ లాక్ డౌన్ రానుందా?
అవును... ఐదేళ్ల క్రితం కోవిడ్-19 తర్వాత తాజాగా చైనాను మరో వైరస్ వణికిస్తోంది. ఇందులో భాగంగా.. .హెచ్.ఎం.పీ.వీ. (హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్) వ్యాప్తి చైనాలో పెను సమస్యగా మారుతుందని అంటున్నారు.
'చైనా', 'వైరస్'... ఈ రెండు పదాలనూ కలిపి చదివితే ప్రపంచం వణికిపోతుంటుందని అంటారు. కారణం... సుమారు ఐదేళ్ల క్రితం చైనాలో పుట్టినట్లు చెప్పే కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఆ వణుకు ఛాయలు ఇప్పటికీ తగ్గలేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఓ వైరస్ చైనాను వణికించడం మొదలుపెట్టింది.
అవును... ఐదేళ్ల క్రితం కోవిడ్-19 తర్వాత తాజాగా చైనాను మరో వైరస్ వణికిస్తోంది. ఇందులో భాగంగా.. .హెచ్.ఎం.పీ.వీ. (హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్) వ్యాప్తి చైనాలో పెను సమస్యగా మారుతుందని అంటున్నారు. వెలువడుతున్న నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు ఈ వైరస్ వ్యాప్తి తీవ్రతను సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో... ఈ వ్యాధి లక్షణాలు దాదాపు కరోనా వైరస్ ను పోలి ఉండటంతో.. ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని అంటున్నారు. ఈ సమాంలో నెట్టింట దర్శనమిస్తున్న వీడియోలు... చైనాలోని ఆస్పత్రుల్లో మాస్కులు ధరించి, రద్దీగా ఉన్న దృశ్యాలను చూపిస్తున్నాయి. ఇదంతా కొత్త వైరస్ ఎఫెక్ట్ అని అంటున్నారు.
మరికొంతమంది మాత్రం 2019 డిసెంబర్ 31న చైనాలో చిన్నగా మొదలైన కరోనా వైరస్.. మూడు నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారని తెలుస్తోంది. అలాకానిపక్షంలో... మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారంట.
హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్ లక్షణాలు!:
దగ్గు
జ్వరం
గొంతు నొప్పి
ముక్కు కారడం
శ్వాస సరిగా ఆడకపోవడం
శరీరంపై దద్దుర్లు
ఇది ఎలా సంక్రమిస్తుంది?:
హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్ అనేది.. అది కలిగి ఉన్న వారితో ప్రత్యక్ష పరిచయం ద్వారా లేదా.. వైరస్ తో కలుషితమైన వస్తువులను తాకడం ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు.
అంటే... ఉదాహరణకు... షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, కౌగిలించుకొవడం, ముద్దు పెట్టుకోవడం తో పాటు ఫోన్స్, కీబోర్డ్స్, డోర్ హ్యాండిల్స్ వంటి వస్తువులను తాకడం ద్వారా కూడా వ్యాపిస్తుందని అంటున్నారు.