టీడీపీకి కొత్త కష్టం.. ఇలా చేస్తే.. ఇబ్బందేనా..!
ప్రధానంగా టీడీపీకి సమస్యగా మారిన నియోజకవర్గం పెనమలూరు. ఇక్కడ నుంచి ప్రస్తత వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీవైపు చూస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కొత్త చిక్కులు వచ్చాయి. ఎన్నికల వరకు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పు డు ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో అనూహ్యంగా పరిణామాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ దక్కని వారు.. ఇప్పుడు టీడీపీ బాట పడుతున్నారు. వీరిని చేర్చుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, అలా వచ్చేవారు.. ఊరికేనే రావడం లేదు. తమ తమ కోరికల చిట్టాలను మోసుకువస్తున్నారు.
వీటికి అంగీకరించాలా? వద్దా? అనే విషయంలో చంద్రబాబు కు తిప్పులు వస్తున్నాయి. జంపింగ్ నేతల చిట్టాలకు అంగీకరిస్తే.. స్థానికంగా ఉన్న కేడర్ సహా.. కీలక నాయకులు తనపై ఫైర్ కావడం.. పార్టీలో అసమ్మతికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగని సదరు నేతలను దూరంగా పెడితే.. పార్టీ మరింత పుంజుకోవాలన్న తన వ్యూహం దెబ్బతింటుందని భావిస్తున్నారు. దీంతో జంపింగులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రధానంగా టీడీపీకి సమస్యగా మారిన నియోజకవర్గం పెనమలూరు. ఇక్కడ నుంచి ప్రస్తత వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీవైపు చూస్తున్నారు. టికెట్ కూడా కోరుతున్నారు. అయితే. ఇప్పటికే ఈ స్థానంలో టీడీపీకి బలమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు. దీంతో ఈయనను కాదని.. కొలుసుకు టికెట్ ఇవ్వడం అంటే.. సాహసోపేత మైన నిర్ణయం.. అవుతుంది. పైగా.. కొన్ని దశాబ్దాలుగా టీడీపీకి బద్ధ వ్యతిరేకిగా కొలుసు ముద్రపడ్డారు.
ఈ పరిణామం.. టీడీపీని ఇరకాటంలో పడేసింది. ఇక, ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ.. ఒకరిద్దరు వైసీపీ నాయకులు టీడీపీవైపు చూస్తున్నారు. వీరిని చేర్చుకుంటే.. స్థానికంగా ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగని వదిలేయను కూడా లేరు. ఎలాంటి ఆశలు, ఆకాంక్షలు లేకుండా కేవలం.. టీడీపీని గెలిపించేందుకు వస్తామంటే ఓకే చెప్పాలని నిర్ణయించారు. ఇక, ఇప్పటికే గుంటూరుకు చెందిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి టికెట్ ఎక్కడ ఇవ్వాలో అర్ధం కావడం లేదు. నెల్లూరు నుంచి వచ్చి చేరిన వారిలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇవన్నీ.. ఎన్నికలకు ముందు టీడీపీకి చిక్కులేనని అంటున్నారు పరిశీలకులు.