కోదండరాం సర్... మీ వెంట నడిచిన వారి ఉద్యోగాలు ఊస్ట్ అవుతున్నాయి
మరోవైపు ఆయనపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులుగా పేరొందిన వర్గాలు ఏకంగా మీడియా ముఖంగా విరచుకుపడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ గడీల పాలనకు విముక్తి కల్పించి... ఉక్కు గేట్లు లేకుండా ప్రజాలు తమ అభిప్రాయాలు చెప్పుకొనే వేదిక అందిస్తామని ప్రకటించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రేవంత్ రెడ్డికి ఊహించని విమర్శలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయనకు మద్దతు ఇచ్చిన వివిధ సంఘాలు, ప్రజాస్వామ్య వేదికలు ఇప్పుడు ఆయనపై కత్తులు దూస్తున్నాయి. రేవంత్ రెడ్డి పాలనకు ఓ వైపు ఏడాది సమీపిస్తుంటే... మరోవైపు ఆయనపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులుగా పేరొందిన వర్గాలు ఏకంగా మీడియా ముఖంగా విరచుకుపడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు నిరసిస్తూ దాదాపు ఏడాదిన్నరగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. కాగా, దీనికి ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. అయితే, ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇప్పుడు ఏకంగా రాష్ట్రస్థాయికి చేరింది. ప్రజాస్వామ్యయుతంగా గలం వినిపించడంలో ప్రముఖంగా ఉండే హరగోపాల్ ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. టీచర్ సస్పెండ్‌ను ఖండిస్తూ,
ఇలాంటి నిర్ణయాలు ఊహించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరగోపాల్ మరిన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. సమాజానికి మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి భయపెట్టడం ఎంత మాత్రం తగదని ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. తంలో తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్ పోరాటం చేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పందించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని హరగోపాల్ హెచ్చరించారు.
కాగా, తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి నడిచిన టీచర్ ను సస్పెండ్ చేయడం, పైగా ప్రజలు వ్యతిరేకిస్తున్న అంశంలో మద్దతిచ్చిన కారణాన్ని ప్రస్తావించడం ప్రభుత్వాన్ని ఇరుకునపడేసే అంశంగా భావిస్తున్నారు. ఏకంగా ప్రజాస్వామ్యవాదులు తమ గళాన్ని వినిపించేలా ఈ అంశం మారడం, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని పేర్కొనడం చూస్తుంటే... ఈ విషయంలో రేవంత్ సర్కారు ఇరుకునపడటం ఖాయమని అంటున్నారు.