దారుణం... పీరియడ్స్ నొప్పి భరించలేక బాలిక సూసైడ్!

తాజాగా ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది! పీరియడ్స్ నొప్పి భరించలేక ఒక చిన్నారి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది!

Update: 2024-03-29 04:39 GMT

ఇప్పటికే మనదేశంలో చాలా విషయాలపై బహిరంగంగా మాట్లాడటానికి, ఓపెన్ గా సమస్యలు చెప్పుకోవడానికి వెనక్కి తగ్గే విషయాలు ఎక్కువగానే ఉన్నాయి! ఇందులో ప్రధానంగా శృంగారం, పీరియడ్స్ వంటివాటికి సంబంధించిన విషయాలపై అయినవాళ్లతో అయినా చర్చించడానికి, చెప్పుకోడానికి సంకోచిస్తూనే ఉంటారు. వాటిపై అవగాహన లేక చాలా మంది వారిలో వారే కుమిలిపోతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది! పీరియడ్స్ నొప్పి భరించలేక ఒక చిన్నారి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... ముంబైలోని మల్వానీ ప్రాంతంలోని స్థానిక లక్ష్మీ చాల్స్ లో నివసిస్తున్న ఓ 14 ఏళ్ల బాలికకు ఫస్ట్ టైం పిరియడ్స్ మొదలయ్యాయి! అయితే... పీరియడ్స్ గురించి ఆమెకు ఎలాంటి అవగాహనా లేదో.. లేక, తల్లి ఆ విషయాలపై స్పష్టత ఇవ్వలేదో తెలియదూ కానీ.. ఆ సమయంలో వచ్చిన తీవ్రమైన నొప్పిని ఆ బాలిక భరించలేకపోయింది! దీంతో ఈవ్ర ఒత్తిడికి గురైంది! ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఈ నెల 26వ తేదీన జరిగినట్లు చెబుతున్నారు!

ఆ సమయంలో రాత్రి ఇంటికి వచ్చి చూడగా... ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారితో కలిసి ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో.. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మరణించినట్లు ధృవీకరించారు. దీంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమయంలో ఆత్మహత్య కేసు కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులతో.. బాలికకు ఇటీవలే ఫస్ట్ టైం పిరియడ్స్ వచ్చినట్లు తల్లితండ్రులు తెలిపారని తెలుస్తుంది. దీంతో... ఆ నొప్పిని భరించలేకే ఆ బాలిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుమసభ్యులు చెబుతున్నారు! ఈ నేపథ్యంలో... ఈ ఘటనలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు! ఇందులో భాగంగా బాలిక సెల్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్స్ ని చెక్ చేస్తున్నట్లు తెలుస్తుంది!

కాగా... పీరియడ్స్, వాటికి సంబంధించి ఎదురయ్యే సమస్యలపై బాలికలకు, కొంతమంది యువతులకు సరైన అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణం అవుతోందని వైద్యులు చెబుతున్నారు! వారికి ఈ విషయాలపై అవగాహన కల్పించడంలో తల్లి పాత్ర కీలకం అని అంటున్నారు!

Tags:    

Similar News