అసభ్య పదజాలం వాడకపోవడమే అసమర్ధతేమో?... సారథి సంచలన వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా... బహుశా తాను ఎవరినీ కొట్టలేను, ఎవరినీ అసభ్య పదజాలంతో తిట్టలేను కాబట్టి తాను సూటయ్యి ఉండకపోవచ్చని అన్నారు.

Update: 2024-01-12 07:29 GMT

గతకొన్ని రోజులుగా పెనమలూరు ఇన్ ఛార్జ్ ని మారుస్తారంటూ కథనాలొస్తున్న వేళ.. ఆ కథనాలకు బలం చేకూరుస్తూ ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ని కాదని వైసీపీ అధిష్టాణం మంత్రి జోగి రమేష్ ని ఇన్ ఛార్జ్ గా నియమించింది. దీంతో పార్థసారథి టీడీపీలో చేరబోతున్నారని కథనాలొస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... పెనమలూరు కు సమన్వయకర్తగా జోగి రమేష్ ని నియమించిన అనంతరం పార్థసారథి పార్టీని వీడటం ఆల్ మోస్ట్ కన్ ఫాం అని అంటున్నారు! ఈ సందర్భంగా స్పందించిన ఆయన పెనమలూరుతో తనకు సుమారు 20-25 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. ఈ సందర్భంగా తనకు నిన్న మంత్రి పదవి రాకపోవడానికి, నేడు ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడానికి గల కారణాలను చెబుతూ... కీలక స్టేట్ మెంట్స్ ఇచ్చారు!

ఇందులో భాగంగా... బహుశా తాను ఎవరినీ కొట్టలేను, ఎవరినీ అసభ్య పదజాలంతో తిట్టలేను కాబట్టి తాను సూటయ్యి ఉండకపోవచ్చని అన్నారు. అంతకుమించి తనలో ఉన్న లోపమేమీ లేదన్నట్లుగా పార్థసారథి అన్నారు. ప్రతిపక్షాలను అసభ్యపదజాలంతో తిట్టడం వంటివి తాను చేయలేనని చెప్పడంతో.. తనకు పార్టీపై కమిట్ మెంట్ లేదని పార్టీ భావించి ఉందేమో అని పార్థసారథి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో తనకు వైఎస్సార్ అప్పట్లో మంత్రిపదవి ఇచ్చారని.. అయితే తనకు అర్హత ఉండి కూడా మంత్రిపదవి రాలేదని, ఆ అసంతృప్తి ఎవరికైనా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని పార్థసారథి తెలిపారు. సర్వేల ఫలితాలు జోగి రమేష్ కి అనుకూలంగా ఉన్నాయోమో అంటూ వ్యాఖ్యానించారు!!

మరోపక్క... వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచే పోటీ చేయబోతున్నట్లు పార్థసారథి తన అనుచరులతో చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో రేపు మధ్యాహ్నం సారధి.. చంద్రబాబుతో భేటీ అవుతారని.. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 21న పసుపు పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. అంతకంటే ముందు ఈ నెల 18న పెనమలూరులో కేడర్ తో సారధి సమావేశం అవుతారని చెబుతున్నారు.

కాగా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీచేసిన పార్ధసారథి.. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ పై 11వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ 2014లో బోడె ప్రసాద్ టీడీపీ నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో పెనమలూరు నుంచే సారథి పోటీచేస్తానని చెబుతున్న నేపథ్యంలో... సర్ధుబాటుపై ఆసక్తి నెలకొంది!

Full View
Tags:    

Similar News