అందరినీ గుర్తుపెట్టుకున్న పవన్... వైరల్ ట్వీట్!
అవును... ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లు పూర్తైన సంగతి తెలిసిందే. దీంతో.. ఇటీవల అధికారంలోకి వచ్చిన తొలిసారి 12వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తనను తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పవన్.. అదే నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
జనసేన పార్టీ చరిత్రలో ఈ సభ ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతోందని అంటున్నారు. ఇక.. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంలో ఎన్నో సంచలన విషయాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ పలు కీలక విషయాలపై పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సమయంలో తాజాగా ప్రతీ ఒక్కరినీ గుర్తుపెట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు పవన్.
అవును... ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఆ సభకు సహకరించినవారికి, సమకూర్చినవారికి, హాజరైనవారికి, విజయవంతం చేసినవారికి అందరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా... జనసేన పార్టీ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని, 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. మంత్రి నారా లోకేష్.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి.. ఎన్డీయే పక్ష నాయకులు, ఇతర నాయకులు, సినిమా ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కల్యాణ్.
ఈ సందర్భంగా... రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా జనసేనను నిర్మాణం చేయడంతో పాటుగా.. సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా.. మరింత బాధ్యతగా పనిచేసే దిశగా పార్టీ అడుగులు వెయ్యనుందని స్పష్టం చేశారు. అనంతరం మరో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు పవన్ కల్యాణ్.
ఇందులో భాగంగా... జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీరమహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడంలో అనేకమంది వేదిక మీద లేకపోయినా సరే ఎంతో కష్టపడ్డారని.. సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పిన పవన్ కల్యాణ్.. వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
ఈ సందర్భంగా.. ముందుగా ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు అన్ని విధాలుగా సహకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపిన పవన్ కల్యాణ్.. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే సమయంలో కాకినాడ పోలీస్ వారికి, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు అని తెలిపారు పవన్. ఇదే క్రమంలో... సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా... పార్టీ తరఫున ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమైన వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, "జయకేతనం" సభ విజయవంతం అయ్యేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్ కు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదే క్రమంలో... ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ జిల్లాల నాయకులకు పవన్ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో... కార్యక్రమం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పరిశీలించి.. సభాస్థలం ఎంపిక నుంచి, సభ పూర్తయ్య వరకు అడుగడుగునా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ఏ విధమైన అసౌకర్యం జరగకుండా నిర్వహించిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కే.ఎస్.ఎస్.రావు కి, వారి కమిటీ సభ్యులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం... సభకు హాజరైన జనసేన శ్రేణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు బృందాన్ని సిద్ధం చేసి, వైద్య సేవలు అందించిన డాక్టర్ సెల్ బృందానికి, సభ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ అందించిన సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు.
ఇక.. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనలు నిర్వహించి.. జనసేన పార్టీ సంస్కృతులను కాపాడే విధానం తెలియజేసేందుకు కృషి చేసిన సాంస్కృతిక విభాగం కమిటీకి, హరీష్ సాయికి, కళాకారులను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్ తెలిపారు.
ప్రధానంగా... తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అవ్వకుండా వారికి దారి పొడవునా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేసి పండ్లు, మజ్జిగ, నీరు, ఆహారం అందించిన ఫుడ్ కమిటీ విభాగానికి, స్టేజ్ డెకరేషన్, లైటింగ్, సౌండింగ్ బృందానికి, ప్రతీ ఒక్క కార్మికుడికి, కార్యక్రమం అనంతరం ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ అభినందిస్తున్నట్లు పవన్ తెలిపారు.
ఇదే క్రమంలో... సభకు స్థలాన్ని అందించిన దాతలకు, సభా వేదిక వద్ద పారిశుద్య సేవలు అందించిన పారిశుద్య సిబ్బందికి, వారిని సత్కరించిన ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కి ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్.
ఇక.. కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ, సహకారాలు అందించిన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి, తన వ్యక్తిగత భద్రత సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన పవన్ కల్యాణ్.. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్సాహంతో, ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.