ట్రంప్ కు ఎంత కష్టం వచ్చింది? గంట సేపు వెయిటింగ్ చేయిపించిన పుతిన్ !

ఇందులో భాగంగా... తాజాగా మంగళవారం పుతిన్ తో ట్రంప్ గంట వెయిట్ చేసి మరీ ఫోన్ లో చర్చలు జరిపారు.;

Update: 2025-03-19 14:00 GMT

అవిరామంగా జరుగుతోన్న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వంతు ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అటు ఉక్రెయిన్ ను కంట్రోల్ లో పెడుతూ, మరో పక్క పుతిన్ తో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా... తాజాగా మంగళవారం పుతిన్ తో ట్రంప్ గంట వెయిట్ చేసి మరీ ఫోన్ లో చర్చలు జరిపారు.

అవును... రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి, హింసను ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ముందుగా వెళ్లడించినట్లుగానే మంగళవారం పుతిన్ తో సుమారు గంటకు పైగా చర్చలు జరిపారు. అయితే.. ఇక్కడొక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... పుతిన్ తో ఫోన్ కాల్ మాట్లాడటం కోసం ట్రంప్ గంటకు పైగా వెయిట్ చేశారంట.

ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రష్యా ప్రెసిడెంట్ తో మాట్లాడటానికి అమెరికా ప్రెసిడెంట్ గంటకు పైగా నిరీక్షించారనే కథనాలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. ట్రంప్ ఏ సమయంలో ఫోన్ చేస్తారనే విషయం పుతిన్ కు తెలియనందువల్లే ఈ అసౌకర్యం కలిగిందని క్లారిటీ ఇచ్చారు.

సరిగ్గా ట్రంప్ నుంచి ఫోన్ వచ్చేసరికి.. పుతిన్ పారిశ్రామికవేత్తల మీటింగ్ లో ఉన్నారని తెలిపారు. మరోపక్క... ట్రంప్, పుతిన్ మధ్య మంగళవారం జరిగిన చర్చలు సుమారు రెండు గంటలు ఆలస్యం అయ్యాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ సందర్భంగా... నెల రోజుల పాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపేసేలా చూసేలా అమెరికా, రష్యా నిర్ణయించాయని పేర్కొంది.

ఈ విషయాలపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... ఇరు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను బుధవారమే పరస్పరం అప్పగించుకోనున్నాయని తనకు పుతిన్ చెప్పారని తెలిపారు. ఇదే సమయంలో.. తీవ్రంగా గాయపడిన 23 మంది ఉక్రెయిన్ సైనికుల్ని కూడా రష్యా అప్పగించనుందని వెల్లడించారు!

కాగా... రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తమ దేశంలోని సైనికుల మరణాలపై రష్యన్ స్వతంత్ర వార్తా సైట్ మీడియజోనా ఓ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉక్రెయిన్ తో పోరాడుతూ 1,65,000 మంది రష్యా సైనికులు మరణించారని తెలిపింది. మరోపక్క రష్యాతో యుద్ధంలో తమ సైనికులు 46,000 మందికి పైగా మరణించారని ఉక్రెయిన్ తెలిపింది.

Tags:    

Similar News