పాత చర్చ కొత్తగా... చంద్రబాబు కీలక సమీక్షకు పవన్ డుమ్మా!

ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ, దిశానిర్ధేశం చేశారు. ఇంతటి కీలక సమావేశానికి పవన్ కల్యాణ్ గైర్హాజరయ్యారు.

Update: 2025-02-11 09:38 GMT

ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి రేపటికి 8 నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రేపటికి 8 నెలలు పూర్తవ్వబోతోంది. ఈ సమయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ, దిశానిర్ధేశం చేశారు. ఇంతటి కీలక సమావేశానికి పవన్ కల్యాణ్ గైర్హాజరయ్యారు.

వాస్తవానికి ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ కి పవన్ హాజరుకాలేదు. అయితే.. అప్పుడు ఆయన వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో... కేబినెట్ మీటింగ్ కు హాజరవ్వకపోవచ్చని తెలిపింది. అన్నట్లుగానే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ హాజరుకాలేదు.

అయితే... పవన్ కల్యాణ్ ప్రస్తుతం కాస్త కోలుకున్నట్లు చెబుతున్నారు. బుధవారం దక్షిణాది యాత్రకు వెళ్లనున్న పవన్ షెడ్యూల్ ఇవాళ ఖాళీగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ అత్యంత కీలక సమావేశానికి హాజరు కాలేదు! దీంతో... కూటమిలో ఏమైనా లుకలుకలు మొదలయ్యాయా అనే చర్చ అప్పుడే సోషల్ మీడియా వేదికగా మొదలైపోయింది.

వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాల్లో దేనికైనా పవన్ కల్యాణ్ గైర్హాజరైతే వెంటనే ఈ తరహా "లుకలుకలు" చర్చ తెరపైకి వస్తుంటుంది. ఈ సమయంలో తాజాగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశానికి హాజరుకాకపోవడంపై మరోసారి మొదలైంది.

పవన్ కల్యాణ్ దక్షిణాది యాత్ర!:

ఈ నెల 12 నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా... తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో.. మధుర మీనాక్షి, అనంత పద్మనాభ స్వామి, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి, స్వామిమలై ఆలయాలను ఆయన దర్శించుకుంటారు.

Tags:    

Similar News