జీవీఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి ?

అయితే ఆమ్రపాలిని పంచాయతీ రాజ్ శాఖలో కీలక పదవిలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు

Update: 2024-10-17 16:06 GMT

తెలంగాణా నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇస్తారు అన్నది చర్చ సాగుతోంది. ఆమె 2010 బ్యాచ్ ఐఏస్ అధికారిణి. ఆమెను మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ గా నియమిస్తారు అని ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్, మునిసల్ మంత్రి నారాయణ చర్చించి ఒక నిర్ణయనానికి వచ్చారు అంటున్నారు.

యువ ఐఏఎస్ గా సమర్ధవంతమైన అధికారిగా ఆమ్రపాలికి గుర్తింపు ఉంది. దాంతో విశాఖ వంటి మెగా సిటీ అభివృద్ధికి ఆమె సేవలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారని భోగట్టా. అంతే కాదు దానికి కారణం ఏంటి అంటే ఆమె కొన్నాళ్ళ పాటు చదువుకున్నారు. విశాఖ గురించి ఆమెకు బాగా తెలుసు అని అంటున్నారు. ఆమె సొంత జిల్లా ఒంగోలు అయినా విశాఖ మీద అవగాహన పూర్తిగా ఉంది అని అంటున్నారు. అదే విధంగా ఆమె తండ్రి కాటా వెంకట రెడ్డి ఏయూలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా సేవలు అందించారు.

ఉమ్మడి ఏపీలో ఆమె విధులలో చేరగా విభజన తరువాత సర్వీస్ అంతా తెలంగాణా రాష్ట్రంలోనే సాగింది. వికారాబాద్ సబ్ కలెక్టర్ గా ఆమె తొలి పోస్టింగ్ గా ఉంది. అక్కడ ఆమె తన పనితీరుతో ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకుని భేష్ అనిపించుకున్నారు.

ఇక ప్రధానమంత్రి ఆఫీస్ లో డిప్యూటీ సెక్రటరీగా ఆమె కొంతకాలం పనిచేశారు. ఆమెని ఇపుడు విశాఖకు కమిషనర్ గా నియమిస్తే కనుక తప్పనిసరిగా అభివృద్ధితో పాటు విశాఖ జీవీఎంసీలో పాలనను ఒక గాడిలో పెడతారు అని అంటున్నారు.

విశాఖకు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా తగిన ప్రాధాన్యత ఇస్తోందని దానికి అనుగుణంగా సమర్ధవంతమైన అధికారిని నియమించాలని అనుకుంటోందని చెబుతున్నారు అయితే ఆమ్రపాలిని పంచాయతీ రాజ్ శాఖలో కీలక పదవిలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు పంచాయతీ రాజ్ పేషీలో మంచి అధికారులను పెట్టి ఉత్తమ పాలనకు తెర తీస్తున్న పవన్ కళ్యాణ్ సైతం ఆమ్రపాలి వైపు చూస్తున్నారు ప్రచారం సాగుతోంది.

మొత్తం మీద చూస్తే ఈ యువ ఆధికారిణి ఎక్కువ శాతం విశాఖ కార్పొరేషన్ కమిషనర్ గా వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. అలా కాకపోతే కనుక పంచాయతీ రాజ్ లో ముఖ్య బాధ్యతలు స్వీకరిస్తారు అని అంటున్నారు. ఏపీ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా ఉన్న జి సృజన తెలంగాణాకు వెళ్తున్నారు. కాబట్టి అక్కడ నుంచి వచ్చిన మంచి అధికారులను కీలక విభాగాలలో వాడుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News