పవన్, లోకేష్, బండి సంజయ్ ఏమి మాట్లాడుకుంటున్నారు?
ఈ సందర్భంగా ఆయనకు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం లభించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం లభించింది. ఇందులో భాగంగా... ఆయనకు కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, పలువురు నేతలు స్వాగతం పలికారు.
అనంతరం అమిత్ షా రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అమిత్ షాకు చంద్రబాబు నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. అమిత్ షా - చంద్రబాబు మధ్య సుమారు 30 నిమిషాల పాటు అంతరంగిక చర్చలు జరిగాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం జరిగింది. ఇందులో భాగంగా... పవన్, లోకేష్, బండి సంజయ్ ముగ్గురూ కాసేపు చిట్ చాట్ చేశారు.
అవును... ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కృష్ణానదీ తీరాన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేష్ ల మధ్య కాసేపు మాటామంతీ జరిగింది. ఈ సందర్భంగా ఈ చిట్ చాట్ కు సంబంధించిన ఫోటోలను బండి సంజయ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన సంజయ్... పవన్ కల్యాణ్, నారా లోకేష్ లను సహోదరులు అని సంభోధించగా.. తమ మధ్య జరిగిన నిజాయతీతో కూడిన సంభాషణలు ఎల్లప్పుడూ ప్రభావం చూపుతాయని అన్నారు. ఈ నేపథ్యంలో... ఈ ముగ్గురూ ఏమి మాట్లాడుకున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క బండి సంజయ్ కు నారా లోకేష్ జ్ఞాపికను బహుకరించారు.
మరోపక్క అమిత్ షా రాష్ట్ర పర్యటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఇందులో భాగంగా.. ఏపీకి కేంద్ర ప్రభుత్వ నిరంతర మద్దతుకు మరింత తోడ్పాటుని ఈ పర్యటన ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. విపత్తు నిర్వహణ, భద్రత పెంపు చర్యలను మరింత ప్రభావవంతంగా చేపట్టడానికి ఎన్.డీ.ఆర్.ఎఫ్. రైజింగ్ డే వేడుకల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.