పంచాయతీలకు మంచి రోజులు... పవన్ సంచలన నిర్ణయాలు!

వాటిని కేంద్రం నుంచి రావాల్సిన నిధులనూ మళ్లించారనే తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-07-02 14:29 GMT

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడినట్లు తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పంచాయతీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సర్పంచులు గగ్గోలు పెట్టేవారు. వాటిని కేంద్రం నుంచి రావాల్సిన నిధులనూ మళ్లించారనే తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ సంచలన ప్రకటనలు చేశారు.

అవును... గత ప్రభుత్వ పాలనలో పంచయతీలన్నీ నిధుల లేమితో అల్లాడాయనే సంగతి తెలిసిందే! ఈ సమయంలో తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పంచాయతీలకు రావాల్సిన నిధులు వాటికి సక్రమంగా రాకపోవడం ఒక ఎత్తయితే.. ధర్మంగా పంచాయతీలకు చెందాల్సిన వాటాలను సైతం ఇవ్వలేదని అన్నారు.

ఇదే సమయంలో గ్రామాల నుంచి రావాల్సిన నిధులు మళ్లించారు తప్ప ఒక్క పైసా కూడా ఇచ్చింది లేదని తెలిపారు. మరోపక్క కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధుల్ని కూడా దారి మళ్లించారని చెప్పిన పవన్... గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో... గ్రామ పంచాయతీలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన వాటాలను కూడా గత ఐదేళ్లుగా ఇవ్వలేద్ని చెప్పిన పవన్... పంచాయతీ రాజ్ సమీక్షలు చేస్తున్నప్పుడు అధికారుల్లు చెబుతున్న మాటలు వింటే పాలనపై గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం చూసి వేదన కలుగుతుందని తెలిపారు. త్వరలో దీనిపై క్యాబినెట్ హై లెవెల్ కమిటీ వేసి, పంచాయతీలకు రావాల్సిన నిధులపై దృష్టి పెడతామన్నారు.

Read more!

తాజాగా కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో వివిధ శాఖలపై సుమారు నాలుగు గంటల పాటు పవన్ కల్యాణ్ సమీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... నిబంధనల ప్రకారం పంచాయతీలకు జనాభాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించాలని.. అలాగే వివిధ శాఖలవారీగా వాటాలను ఇవ్వాల్సి ఉంటుందని.. అయితే గత వైసీపీ పాలనలో పంచాయతీలకు ఏ వైపు నుంచీ నిధులు రాలేదని ఫైర్ అయ్యారు.

ఇసుకపై ఏటా రూ. వెయ్యి కోట్లు!:

ఏపీలో ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే ఇసుకపై ఏటా రూ. వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వస్తోంది. ఈ మొత్తంలో పంచాయతీలకు ఇసుక సీనరేజ్ వాటా ఇవ్వాలి. కానీ... గత ప్రభుత్వ హయాంలో అది ఎక్కడా దక్కలేదని పవన్ తెలిపారు. అధికారులను ఈ విషయంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయమని ఆదేశించినట్లు తెలిపారు. మొదట పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేయాలని అన్నారు.

Tags:    

Similar News

eac