ఒక్కసారి అసెంబ్లీకి ..పవన్ ఇలా అన్నాక...!
తాను అసెంబ్లీకి ఒకే ఒక్కడుగా వెళ్ళినా మేలు చేసేవాడిని అని ఆయన గతాన్ని నెమరు వేసుకున్నారు. నాతో పాటు పట్టుమని పాతిక మంది కూడా లేరు.
దయచేసి ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించడయ్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఓటర్లను అర్ధించారు. నన్ను అసెంబ్లీకి పంపిస్తే మీకే మేలు జరుగుతుంది అని పవన్ అన్నారు. ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను 2019లో ఒక్కడిని అయినా గెలిపించి ఉంటే బాగుండేది అని అన్నారు.
తాను అసెంబ్లీకి ఒకే ఒక్కడుగా వెళ్ళినా మేలు చేసేవాడిని అని ఆయన గతాన్ని నెమరు వేసుకున్నారు. నాతో పాటు పట్టుమని పాతిక మంది కూడా లేరు. ఇరవై ఒక్క మందిమే ఉన్నామని అన్నారు. అందరినీ ఆశీర్వదించి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం, జనసేన బీజేపీ పొత్తులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఇక తాను పిఠాపురం నియోజకవర్గాన్ని సొంత ప్రాంతంగా చూసుకుంటాను అని పవన్ హామీ ఇచ్చారు. అంతే కాదు స్థలం చూసుకుని పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటాను అని అందరికీ అందుబాటులో ఉంటాను అని పవన్ మరో హామీ ఇచ్చారు.
తాను పిఠాపురంలోనే ఉంటాను అని కూడా చెప్పారు.తన రాజకీయ ప్రస్థానం కానీ తన భవిష్యత్తు కానీ అన్నీ పిఠాపురాన్ని కేంద్రంగా చేసుకుని చేస్తామని పవన్ చెప్పడం విశేషం. ఇక్కడ్ ఆయన మరో మాట కూడా అన్నారు. ఇప్పటిదాకా తూర్పు గోదావరి జిల్లా ప్రజల మనోభావాలంతో ఆడుకున్నవారినే అంతా చూసారని ఇపుడు తాను అలా చేయను అని అన్నారు. వారికి అన్ని విధాలుగా తోడు ఉంటాను అని చెప్పారు.
తాను పార్టీ అధినేతను అని తాను రాష్ట్రమంతా తిరుగుతాను అని అందుబాటులో ఉండను అని బయటకు అనకపోయినా జనం మనసులో ఉండవచ్చు అని దానికి తాను పూర్తిగా హామీ ఇస్తున్నాను అని ఆయన చెప్పారు. తాను ఎక్కడ తిరిగినా పిఠాపురం నుంచే కదిలి వెళ్తను మళ్లీ పిఠాపురమే చేరుకుంటాను ఇది నా సొంత గడ్డ అని పవన్ మాటి మాటికి చెప్పారు. మొత్తానికి అయితే ఒక ఎమ్మెల్యే అభ్యర్ధిగానే మాట్లాడారు. జనాలు తనకు ఆదరించాలని ఆయన విన్నవించుకున్నారు. మరి పవన్ మాటలు విని జనాలు లక్ష మెజారిటీ కట్టబెడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.