కారణం ఏదైనా.. జనసేన మరో టిక్కెట్ త్యాగం తప్పేలా లేదు!

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని టీడీపీ, జనసేన కలిసి బీజేపీతో జతకట్టిన సంగతి తెలిసిందే

Update: 2024-03-27 06:32 GMT

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని టీడీపీ, జనసేన కలిసి బీజేపీతో జతకట్టిన సంగతి తెలిసిందే. అందుకు చంద్రబాబు చెప్పిన కారణం... రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం అని కాగా.. పవన్ చెప్పిన కారణం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుడదని!! ఆ సంగతి అలా ఉంటే... కూటమిలో భాగంగా జనసేనకు ముందు 24 అసెంబ్లీ 3 లోక్ సభ స్థానాలను చంద్రబాబు కేటాయించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ పొత్తులోకి బీజేపీ ఎంట్రీ అనంతరం పవన్ కల్యణ్ మరో మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో... అప్పటికి జనసేన పోటీ చేయడానికి మిగిలిన స్థానాలు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు. ఈ క్రమంలోనే నాగబాబు టిక్కెట్ తో పాటు పోతిన మహేష్ వంటి నేతల టిక్కెట్లు పోయాయని అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... పవన్ మరోసారి త్యాగం చేయక తప్పదని తెలుస్తోంది!

అవును... కూటమిలో భాగంగా తమకు కేటాయించిన 24 + 3 కాస్తా.. 21 + 2 అయిన అనంతరం... ఇప్పుడు అది కూడా 20 + 2 అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి!! కూటమిలో భాగంగా 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలను దక్కించుకున్న బీజేపీ... మరో అసెంబ్లీ టిక్కెట్ అడుగుతుందని సమాచారం. ఈ విషయంపై చంద్రబాబును సంప్రదించగా.. ఆయన తన వేలు పవన్ వైపు చూపించారనే చర్చ తెరపైకి వచ్చింది!

144 స్థానాలున్న చంద్రబాబు కాకుండా... 21 స్థానాలున్న పవన్ కల్యానే మరో సీటు త్యాగం చేయడం ఏమిటనే సంగతి కాసేపు పక్కనపెడితే... దీనిపై చంద్రబాబు సూచనతో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా పవన్ కు ఫోన్ చేసినట్లు తెలిసింది! ఈ నేపథ్యంలో తాజాగా 11వ స్థానంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా కడప, చిత్తూరు జిల్లాల ప్రస్థావన వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో... కుదిరితే కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం.. అలాకానిపక్షంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే... ఈ విషయంలో టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదని అంటున్నారు. దీంతో... పవన్ కల్యాణ్ త్యాగం చేయడం తప్పకపోవచ్చని సమాచారం.

వాస్తవానికి టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించని స్థానాలు ఇంకా 5 ఉన్నాయి! అయినప్పటికీ.. వాటిలో ఒకటి కూడా తాము వదులుకోమని బాబు చెప్పారని.. దీంతో, పవన్ కి తప్పేలా లేదని అంటున్నారు. దీంతో... అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రోజు సాయంత్రంలోపు జనసేనకు దక్కిన టిక్కెట్ల సంఖ్యపై ట్రోలింగ్స్ మొదలయ్యే అవకాశం ఉందనే చర్చ నెట్టింట మొదలైపోయింది!

కాగా... కూటమిలో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కినా... ఇప్పటివరకూ వాటిపై క్లారిటీ వచ్చినట్లు లేదు! ఈ సమయంలో ఈ చిక్కుముళ్లు వీడాలంటే మరో నియోజకవర్గం అవసరం ఏర్పడిందని భావించిన బీజేపీ అధిష్టాణం... ఈ మేరకు ప్రపోజల్ తెచ్చిందని తెలుస్తుంది.

Tags:    

Similar News