రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు... సుప్రీంకోర్టులో కీలక పరిణామం!

వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణంరాజుని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలో హింసించారంటూ తెరపైకి వచ్చిన ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-25 09:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో నేడు కీలక పరిణామం చోటు చేసుకొంది. ఇందులో భాగంగా... అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు ఎదురుదెబ్బ తగిలింది.

అవును... రఘురామకృష్ణంరాజుని రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి కస్టడీలో హింసించారనే కేసుకు సంబంధించి అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలు కోర్టుల్లో ఆయనకు ఊరట తిరస్కరణకు గురవ్వగా.. తాజాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణంరాజుని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలో హింసించారంటూ తెరపైకి వచ్చిన ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన కేసును గుంటూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను నిందితుడిగా చేర్చారు.

అయితే.. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఫలితం దక్కలేదు! దీంతో ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పిటిషన్ పై విచారించిన జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలే ధర్మాసనం.. ఈ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో.. ఇది విజయ పాల్ కు బిగ్ షాక్ అని అంటున్నారు.

కాగా రఘురామ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో విజయ పాల్ తో పాటు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News