ఏండ్లకు ఏండ్లు కాపురం చేసి రే*ప్ అంటే ఎలా?

ఇటీవల కాలంలో మగవారిపై పరిహారం వేధింపులు, అత్యా*చారం చేశారనే వేధింపులు ఎక్కువయ్యాయి. వీటిలో నిజనిజాలను తేల్చి కోర్టులు తీర్పులు కూడా ఇస్తున్నాయి.;

Update: 2025-03-07 07:38 GMT

మానవుల్లో ఆడ, మగ సమానం. ఇందులో ఒకరెక్కువ,ఒకరు తక్కువ అనే భావనకు చోటే లేదు. అందరినీ సమానంగా గౌరవించాలి. ఇక మన భారత్ లో మిగతా దేశాల్లో కంటే ఆడవాళ్లను ఎక్కువగానే గౌరవిస్తాం. వారిలో దేవతలను చూసుకుంటాం. సమాజంలోని ఆడవాళ్లను అమ్మ, అక్కా,చెల్లిగా భావిస్తాం..అయినా కొన్ని చోట్ల వారిపై ఆఘాయిత్యాలు జరగడం చూస్తూనే ఉంటాం. వాటిని అలా పక్కనపెడితే మిగతా సందర్భంలో మహిళలకు తగిన గౌరవం ఇవ్వడానికి పురుషులు సిద్ధంగానే ఉంటారు. అలాగే కొందరు మహిళలు పురుషులను వేధించడం చూస్తునే ఉన్నాం. ఇక్కడ జెండర్ ను బట్టి కాదు వారు చేసే పనిని బట్టి చూడాల్సిన అవసరముంది. దొంగతనం ఆడ, మగ ఎవరూ చేసిన దొంగతనమే. వేధింపులు ఎవరు చేసినా వేధింపులే. హత్య ఎవరు చేసినా హత్యే. నేరపూరిత అంశాల్లో ఆడ, మగ తేడా లేదు అని చట్టం చెపుతోంది.

ఇటీవల కాలంలో మగవారిపై పరిహారం వేధింపులు, అత్యా*చారం చేశారనే వేధింపులు ఎక్కువయ్యాయి. వీటిలో నిజనిజాలను తేల్చి కోర్టులు తీర్పులు కూడా ఇస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రే*ప్ చేశాడని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం అడ్డంగా కొట్టివేసింది. ఈ కేసు సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి...పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి సంబంధం పెట్టుకుంటే దానిని రే*ప్ గా భావించలేమని, మహిళ సమ్మతి లేదని నిరూపణ అయితే రే*ప్ గా పరిగణిస్తామని, ఈ కేసులో సమ్మతి లేదు అని చెప్పలేమని కోర్టు పేర్కొంది. ఉన్నత విద్యార్హతలు ఉన్న పరిణితి ఉన్న మహిళ ..ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తే 16 ఏండ్లపాటు అతడిని నమ్మడం అనేది అసంభవమని తెలిపింది. 16 ఏండ్ల పాటు తనపై లైంగిక దాడి జరిపితే..ఆ మహిళ భరించిందంటే నమ్మశక్యంగా లేదని చెప్పింది. సుదీర్ఘ కాలాన్ని చూస్తుంటే లైంగిక సంబంధం పరస్పర సమ్మతితో కొనసాగినట్లు తెలుస్తోందని, ఇన్నేళ్లు శారీరక సంబంధం తర్వాత ఇప్పుడొచ్చి అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టడం సరికాదని సూచించింది.

‘‘16ఏండ్ల పాటు సహజీవనం చేశారు. ఈ కేసు పూర్తిగా ప్రేమ, సహజీవనానికి సంబంధించిన అంశం. ఇందులో అత్యాచారం అనేమాటకు తావులేదు. మహిళ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి సందర్భంలో అతడిపై నేర విచారణ కొనసాగించడం చట్టప్రకారం సమంజసం కాదు’’ అంటూ సుప్రీం ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. 2006లో ఒకరోజు రాత్రి ఇంట్లో చొరబడి రే*ప్ చేశాడని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇన్నేళ్లు మోసం చేశాడని ఓ మహిళ 2022లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో హైకోర్టులోనూ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో సుప్రీం మెట్లు ఎక్కింది సదరు మహిళ. కోర్టు న్యాయాన్ని చూస్తుంది కానీ జెండర్ ను బట్టి కాదు అని మరోసారి కోర్టులు నిరూపించాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News