రాహుల్ కు రూ.200 ఫైన్!
దేశ స్వాతంత్ర్య సమరంలో ఎందరో వీరులు.. త్యాగధనుల గురించి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో మహారాష్ట్రకు చెందిన వీర సావర్కర్ వ్యవహారం మాత్రం మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది.;
దేశ స్వాతంత్ర్య సమరంలో ఎందరో వీరులు.. త్యాగధనుల గురించి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో మహారాష్ట్రకు చెందిన వీర సావర్కర్ వ్యవహారం మాత్రం మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చూస్తే.. మిగిలిన వారికి భిన్నంగా కనిపిస్తుంది. ఆయన జీవితంలో చోటు చేసుకున్న పలు ఉదంతాలు సినిమాటిక్ గా ఉంటాయి. సుదీర్ఘకాలం జైల్లో ఉండటమూ కాదు.. తీవ్ర హింసల్ని ఎదుర్కొన్నారు. అయితే.. ఆయన పోరాటాన్ని వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి.
దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా సావర్కర్ ను పేర్కొంటారు. అదే సమయంలో బీజేపీ వర్గాలు మాత్రం ఆయన్ను పోరాట యోధుడిగా అభివర్ణిస్తారు. ఆకాశానికి ఎత్తేస్తారు. ఆయన త్యాగాలను కథలు కథలుగా చెబుతూ ఉంటారు. వీరికి భిన్నంగా కాంగ్రెస్ నేతల తీరు ఉంటుంది. కొంత కాలం క్రితం వీర సావర్కర్ గురించి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షాకిచ్చారు.
సావర్కర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం అప్పట్లో పెను సంచలనంగా మారటమే కాదు వివాదాస్పదమైంది. 2022లో మహారాష్ట్రలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని.. వారి నుంచి పింఛను తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. రాహుల్ చేసిన వ్యాఖ్యలన్నీ వీర్ సావర్కర్ ను కించపరిచేలా ఉన్నాయన
అయితే.. వీర సావర్కర్ ను గురించి రాహుల్ గాంధీ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు.. ఆయన గౌరవాన్ని భంగపరిచేలా.. కించపరిచేలా ఉన్నట్లుగా పేర్కొంటూ న్రపేంద్ర పాండే అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే.. దీనికి రాహుల్ సానుకూలంగా స్పందించలేదు. కోర్టుకు హాజరు కాలేదు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి రూ.200 ఫైన్ విధిస్తూ యూపీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. అదే సమయంలో తదుపరి విచారణకు రాహుల్ గాంధీ కోర్టు ఎదుట హాజరు కాని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. మరి.. తదుపరి వాయిదాకైనా రాహుల్ వస్తారా? లేదా? అన్నది చూడాలి.