నన్ను సీఎం గా చూడాలనుకుంటున్నారు.. పవన్ హాట్ స్టేట్మెంట్ !

పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను జాతీయ మీడియా వేదికగా బయటపెట్టారు

Update: 2023-07-18 11:01 GMT

మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను జాతీయ మీడియా వేదికగా బయటపెట్టారు. ముందు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అదే ఏపీలోని విపక్షాల అజెండా అని అంటూనే తనను సీఎం గా జనసైనికులు చూడాలని అనుకుంటున్నారు అని ఒక హాట్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ముందు వైసీపీని గద్దె దిగనివ్వండి, సీఎం పదవి అన్నది ముఖ్యం కాదు అని పవన్ ఒక వైపు అంటూనే ఈ కామెంట్స్ చేయడం విశేషం. సీఎం పదవి అన్నది ఎన్నికల తరువాత విపక్ష కూటమి బలాబలాల ఆధారంగా చూసుకుని మాట్లాడుకోవాల్సింది అని కూడా పవన్ అన్నారు.

అదే సమయంలో ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కలసి పోటీ చేయవచ్చు అని ఒక హింట్ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే జనసేన బీజేపీల మధ్యనే పొత్తు ఉందని ఆయన వివరించారు. బీజేపీ టీడీపీల మధ్య అండర్ స్టాండింగ్ లో సమస్యలు ఉన్నాయని పవన్ అంటున్నారు.

ఇక బీజేపీ జనసేన టీడీపీ మూడూ 2014లో కలిసి పోటీ చేశాయి. 2019లో విడిపోయాయి. 2024లో మళ్లీ కలవవచ్చు అని ఆయన తన వైపు నుంచి సానుకూల సంకేతాలు ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే తాను సీఎం రేసులో ఉన్నాను అన్న దాన్ని ఆయన ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియా ముఖంగా చెప్పడం విశేషం.

ఏపీలో పవన్ ఇలాంటి ప్రకటనలు అన్నీ సభలలో మీడియా మీటింగ్స్ లో చేస్తూ వచ్చారు. కానీ పక్కాగా తనను సీఎం గా జనసైనికులు చూడాలని అనుకుంటున్నారు అనంది పవన్ చెప్పడం అంటే కచ్చితంగా తాము అధికార వాటాను కోరుతామని చెప్పడమే అని అంటున్నారు. ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో తమకు సీఎం పదవి షేరింగ్ ఉండాలన్నది పవన్ ఇండైరెక్ట్ గా చెప్పేశారు అని అంటున్నారు.

అయితే జనసైనికులు కోరుతున్నారు అని ఆయన చెప్పడమే విశేషం, మరి దీని మీద టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక ఎన్డీయే మీటింగ్ కి ఒక్క జనసేననే బీజేపీ పిలిచింది. 2018లో ఎన్డీయే నుంచి విడిపోయిన టీడీపీని పక్కన పెట్టింది. అయితే పవన్ మాత్రం ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలసిపోటీ చేస్తాయని చెప్పడం అంటే ఆయన కోరికను అలా బయటపెట్టుకున్నారా లేక బీజేపీతో ఆ దిశగా రాయబారం చేసి ఒప్పించగలను అన్న నమ్మకంతో చెప్పారా అన్నది చూడాల్సి ఉంది.

ఇవన్నీ ఇల్లా ఉంటే బీజేపీ ఆలోచనలు ఏమిటి, జనసేనాని ఈ రకంగా మూడు పార్టీలు ఒక్కటి కావాలని చేస్తున్న డిమాండ్ల మీద కాషాయం పెద్దలు ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్డీయే భేటీ తరువాత ఏపీ పాలిటిక్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జనసైనికులకు హ్యాపీని ఇచ్చే ఒక పవర్ ఫుల్ స్టేట్మెంట్ అయితే పవన్ ఇచ్చేసారు. తాను సీఎం అవుతాను అన్న ఆశను, ఆలోచనను ఆయన దేశ రాజధాని వేదికగా బయటపెట్టారు అని అంటున్నారు.

Tags:    

Similar News