జగన్ కంటే పదింతలు... పవన్ హాట్ కామెంట్స్ !
జగన్ ఎంత అనుకుంటే అంతకు పదింతలు తాను తెగింపు చూపిస్తాను అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీఎం వైఎస్ జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. నర్సాపురంలో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్ధి శ్రీనివాస వర్మ కు మద్దతుగా చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను అన్నింటికీ తెగించిన వాడిని అన్నారు. జగన్ కి నేనేమిటో తెలియదు, నా తెగింపు అంతకంటే తెలియదు అని అన్నారు. జగన్ ఎంత అనుకుంటే అంతకు పదింతలు తాను తెగింపు చూపిస్తాను అన్నారు.
తనను పూర్తిగా తెగించిన వాడిని అని ఆయన అన్నారు. తాను జగన్ వంటి నియంతను ఎదిరించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ అన్నారు. తాను రాజకీయంగా రాటుదేలిన వాడిని అన్నారు ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో ఉంటాని ఊహించే తాను వచ్చాను అని అన్నారు. తాను రాజ్యాంగం సంపూర్ణంగా నమ్మాను అని అన్నారు.
తాను రాజకీయంగా గట్టిపడ్డాను అని అన్నారు. తన పదేళ్ల పోరాటం తరువాత జనసేన బలంగా ఈ రోజు ఉనంది అన్నారు. తన మీద వైసీపీ నేతలు చేసే కామెంట్స్ మీద ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను బయటకు వస్తే తన సొంత సామాజిక వర్గం తో తనను తిట్టిస్తున్నారు అని ఆయన అన్నారు. మేమూ మేమూ కాపులను అని ఎవరైనా తనని తిట్టడానికి వచ్చినా లేక అలాంటి కుల సంబంధం కలిపినా వారి సంగతి తేల్చేందుకు తాను సిద్ధం అని పవన్ అన్నారు.
తన గురించి జగన్ సభలలో ఎక్కువగా మాట్లాడుతున్నారని వాటిని ఇకనైనా ఆపేయడం బెటర్ అని పవన్ అన్నారు. తన దగ్గర ఎవరైనా చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదని పవన్ ఫైర్ అయ్యారు. జగన్ హైదరాబాద్ లోని శివశివానీ స్కూల్ లో టెన్త్ ఇంటర్ పరీక్షా పత్రాలు లీక్ చేస్తున్నపుడే తాను చేగువేరా గురించి చదువుతున్నానని ఆలాగే, నోవమ్ చోమ్ స్కీ వంటి పెద్దవాళ్ల గురించి చదువుతున్నానని పవన్ వ్యాఖ్యానించారు.
తన మీద విమర్శలు చేస్తే అనవసరంగా పడేవాడిని కాను అని ఆయన అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు మెచ్చుకుంటే చిరంజీవి మీకు మంచిగా కనిపించారా ఇపుడు కూటమికి మద్దతుగా నిలిస్తే చెడ్డ అయిపోయరా అని నిలదీశారు.
సింహం సింగిల్ అని పదే పదే అంటున్నారు కానీ తోడేళ్ళు, నక్కలు హైనాల సమూహం అంతా వైసీపీలోనే ఉంది అని పవన్ దెప్పిపొడిచారు. ఏపీకి వైసీపీ తీరని అన్యాయం చేయడమే కాదు, అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని అందుకే ఈ ప్రభుత్వం ఉండకూడదని తాను కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడి కూటమి ఏర్పాటుకు కృషి చేసాను అని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం జగన్ మీద తీవ్ర విమర్శలతో సాగడం విశేషం.